సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.ఈమె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది.
సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ ఈ రోజు పుట్టిన రోజును (Samantha Birthday) జరుపు కుంటుంది.ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి బర్త్ డే కానుకగా పోస్టర్ రిలీజ్ చేసారు.
ఇటీవలే ఈ భామ శాకుంతలం సినిమాతో వచ్చి అట్టర్ ప్లాప్ అందుకుంది.
ఈ సినిమాతో ఈమె తన ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేక పోయింది.
పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాతో ఈమె కొద్దిగా విమర్శలు సైతం అందుకుంది.అయితే ఈ ప్లాప్ నుండి బయటకు వచ్చి తన నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టింది.
ఈమె లైనప్ లో ఉన్న చిత్రాల్లో ”ఖుషి” (Kushi) సినిమా ఒకటి.విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ (Shiva Nirvana) డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపు కుంటుంది.మరి ఈ సినిమా నుండి సమంత పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసారు.సమంత పంజాబీ డ్రెస్ లో మెడలో ఐడి కార్డుతో మెస్మరైజింగ్ స్మైల్ తో ఆఫీస్ కు వెళుతున్న ఉద్యోగి తరహాలో ఈమె క్యాజువల్ లుక్ కూడా అదరగొడుతుంది.స్మైల్ తోనే కిల్ చేస్తున్న ఈ పోస్టర్ ఆమె ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.

ఈ పోస్టర్ సామ్ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు అర్ధం అవుతుంది.చూడాలి ఈ పాత్రతో ఏ స్థాయిలో ఈమె ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది.మరి ఈ సినిమాతో విజయ్ – సమంత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే.







