వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ( BRS party ) 90 నుంచి 100 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది.గత ఎన్నికల్లో 88 సీట్లు కైవసం చేసుకున్నా బిఆర్‌ఎస్ ( అప్పటి టిఆర్‌ఎస్ ) కు ఈసారి అంతకుమించి అనేలా టార్గెట్ నిర్దేశించుకుంది.మరి గులాబీ నేతలు చెబుతున్నట్లుగా బిఆర్‌ఎస్ కు 100 సీట్లు రావడం సాధ్యమేనా ? ఇంతకీ బిఆర్‌ఎస్ కు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి ? తర్గే రిచ్ అయ్యేందుకు కేసిఆర్ వ్యూహం ఏంటి ఇలా చాలా ప్రశ్నలు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లోనూ అలాగే 2019 ఎన్నికల్లోనూ ప్రజలు టిఆర్‌ఎస్ కే మొగ్గు చూపి కేసిఆర్ కు అధికారాన్ని కట్టబెట్టారు.

కేసిఆర్( CM kcr ) అధికారంలోకి వచ్చినది మొదలు కొని ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు పరుస్తూ వచ్చారు.అలాగే పరిశ్రమలు నెలకొల్పడంను ఉద్యోగాలు కల్పించడంలోనూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కాస్త ముందు వరుసలో ఉంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు కేసిఆర్ కే అధికారాన్ని కట్టబెడతారని గులాబీ దళం కాన్ఫిడెంట్ గా ఉంది.అయితే గతంతో పోల్చితే ప్రస్తుతం కేసిఆర్ సర్కార్ పై విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.
కుటుంబ పాలన, అవినీతి, వంటి అంశాలు కేసిఆర్ సర్కార్ పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయనే చెప్పవచ్చు.

ఇదిలా ఉంచితే తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా చెప్పుకునే టిఆర్‌ఎస్ పార్టీ ని బిఆర్‌ఎస్ గా మార్చడంతో పార్టీ పై గతంలో ఉన్న మమకారం ప్రజల్లో ఉండే అవకాశం లేదనేది కూడా కొందరి వాదన.ఇక బీజేపీ( BJP ) రూపంలో బిఆర్‌ఎస్ కు బలమైన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో అత్యంత వేగంగా బలం పెంచుకున్న పార్టీగా బీజేపీని చెప్పుకోవచ్చు.
దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ టాఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది.అందువల్ల బిఆర్‌ఎస్ పై పాజిటివ్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా అంతే స్థాయిలో ఉంది.
ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ నిర్దేశించుకున్న 100 సీట్లు కైవసం చేసుకోవడం కష్టమే అనేది కొందరి వాదన.అయితే కేసిఆర్ తన చతురత తో టార్గెట్ 100 రిచ్ అయ్యేందుకు ఎలాంటి ప్రణాళికలు వేస్తారో చూడాలి.







