ఆకట్టుకున్న ఏజెంట్ ఐటెం సాంగ్.. ఊర్వశి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ”ఏజెంట్” (Agent) సినిమా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ అయితే అయ్యింది కానీ.

 Urvashi Rautela's Expensive Outfit For Agent, Urvashi Rautela, Akhil Akkineni, A-TeluguStop.com

అక్కినేని హీరోకు హిట్ మాత్రం ఇవ్వలేక పోయింది.ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

దీంతో అక్కినేని హీరో ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అని చెప్పాలి.

ఇది పక్కన పడితే ఈ సినిమాలో అఖిల్ (Akhil Akkineni) మాత్రం తన మేకోవర్ తో పాటు యాక్షన్, డ్యాన్స్ తో అలరించాడు అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తో ఒక ఐటెం సాంగ్ కూడా చేయించారు.వైల్డ్ సాలా అంటూ సాగే ఈ సాంగ్ కు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

అఖిల్, ఇంకా ఊర్వశి డ్యాన్స్ కు అంతా ఫిదా అయ్యారు.

థియేటర్స్ లో ఈ జోడీకి ప్రేక్షకులు విజిల్ వేశారు.మాస్ ఆడియెన్స్ ను మాత్రమే కాదు అన్ని వర్గాల వారిని కూడా మెప్పించే విధంగా ఈ సాంగ్ ఉంది.ఇక ఊర్వశి రౌటేలా ఈ సాంగ్ కోసం వేసుకున్న డ్రెస్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

ఏజెంట్ మేకర్స్ డిజైన్ చేయించిన ప్రత్యేకమైన డ్రెస్ లో ఈ అమ్మడు మెరిసిపోయింది.

ఆమె స్పెషల్ కాస్ట్యూమ్ కోసం ఏజెంట్ మేకర్స్ ఏకంగా 20 లక్షల రూపాయలను ఖర్చు చేసి మరీ ఈ డ్రెస్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తుంది.దీంతో ఏజెంట్ నచ్చకపోయినా ఉర్వశి (Urvashi Rautela) ఐటెం సాంగ్ మాత్రం ప్రేక్షకులను అలరించింది అనే చెప్పాలి.ఈమె ఈ ఏడాదిలో చిరు నటించిన వాల్తేరు వీరయ్యలో కూడా చిందేసింది.

ఇక ఇప్పుడు ఏజెంట్ లో అలరించింది.దీంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube