వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda murder case )లో తనకు రక్షణగా నిలిచే అన్ని అవకాశాలు దాదాపు ముగిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా సింపతి యాంగిల్ ని పరిచయం చేస్తునట్టుగా ఉంది కడప ఎంపీ అవినాష్ రెడ్డి ( Y.S.Avinash Reddy )వ్యవహార శైలి చూస్తుంటే .గత కొన్ని నెలలుగా కోర్టు వ్యవహారాలతో టెన్షన్ టెన్షన్ గడిపిన ఆయన ఉన్నట్టుండి పులివెందుల( Pulivendula )లో ప్రజా దర్బార్ నిర్వహించారు .ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించి న్యాయం చేస్తామంటూ హామీలు ఇచ్చారు .అంతేకాకుండా కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో కూడా చాలా బాదాతప్త హృదయం తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి ….కార్యకర్తలే తన బలమని వారి అభ్యున్నతి కోసం ఎంత దూరమైనా వెళ్తామంటూ ఆయన చెప్పుకొచ్చారట .
ఈ హత్యలో తనను అనవసరంగా ఇరికిస్తున్నారని , పార్టీ కార్యక్రమం మీద రాజంపేట వెళ్తున్న తనకు ఫోన్ వచ్చిoదని, విషయం తెలిసినందుని ఆ ఇంటికి వెళ్లాను తప్ప అసలు తనకు ఏ ఫోను రాకపోయి ఉంటే ఈ రోజు ఇలాంటి ఇబ్బందులు పడకపోయి ఉండేవాడినని ఆయన కార్యకర్తలకు చెప్పుకొచ్చారు .ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, ధర్మో రక్షతి రక్షితః అంటూ ఆయన కార్యకర్తలతో వ్యాఖ్యానించారట.
తన అరెస్టు తప్పదని ఇప్పటికే మానసికంగా సిద్ధమైన అవినాష్ రెడ్డి, అరెస్టు తదనంతర పరిణామాలతో నియోజకవర్గంలో తీవ్ర స్థాయి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని దానిని తగ్గించుకునే దిశగానే ప్రజలతో మమేకమై వారిలో సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారనివార్తలు వస్తున్నాయి .చట్టప్రకారం చేయాల్సింది ఇంకేమీ లేదు కాబట్టి కనీసం ప్రజల్లో సానుభూతి నైనా పొందగలిగితే వచ్చే ఎన్నికల లో అది ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నారని అందుకే ఇలాంటి సెంటిమెంట్ స్పీచ్ లు ఇస్తున్నారంటూ విశ్లేషణలు వస్తున్నాయి.
న్యాయస్థానంలో ఓదార్పు దొరకకపోయినా ప్రజలు మద్దతు దొరికితే అదే పదివేలు అని అవినాష్ రెడ్డి భావిస్తున్నారని ,ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోకపోతే భవిష్యత్ రాజకీయ ప్రయాణం కష్ట సాధ్యమని సన్నిహితులు ఇచ్చిన సూచనలతోనే ఆయన ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది .