వైరల్: పాముకుమల్లే మెలికలు తిరుగుతూ పయనిస్తున్న వాహనాన్ని చూసి నిచ్చేష్టులైన జనం!

అవును, మీరు విన్నది నిజమే.ఆ వాహనం మరేదో అనుకోకండి.

 Viral People Who Are Excited To See The Vehicle That Is Moving Like Snakes ,veh-TeluguStop.com

మనందరికీ ఇష్టమైన ట్రైన్‌( train ).అయితే అందులో పెద్ద విషయం ఏముందని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.కావాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో చూడండి మరి.మనలో చాలామందికి రైలు పయనం అంటే చాలా సరదా.లాంగ్ జర్నీ పగటిపూట చేసినపుడు… అది నదులు, కొండలు, కోనలు, పంట చేనుల మధ్య అలా వెళుతుంటే విండో పక్కన కూర్చున్న ప్యాసింజర్లు తన్మయత్వం చెందుతూ, ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వుంటారు.

అదొక అద్భుతమైన ఫీలింగ్.ఓ రకంగా చెప్పాలంటే అది వర్ణించడానికి వీలుకాని అనుభవం.మనలో చాలామంది దాదాపుగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు రైలు మార్గాన్నే ఎంచుకుంటారు.

ఎందుకంటే గజిబిజి గందర గోళం, ట్రాఫిక్, హారన్‌ సౌండ్లు లేకుండా ప్రయాణం హాయిగా సాగుతుంది కాబట్టి.అన్నింటికంటే ముఖ్యమైనది మనకి ఏదన్న బాత్ రూమ్ అవసరం ఏర్పడినపుడు ఇందులో అనువుగా ఉంటుంది.

మిగిలిన మార్గాలలో ఆ ఫెసిలిటీ ఉండదు.ఇక అసలు విషయంలోకి వెళితే… సోషల్ మీడియాలో ప్రస్తుతం పాములాగా మెలికలు తిరిగే ఓ ట్రైన్ వీడియో( Train video ) ఒకటి హల్ చల్ చేస్తోంది.

అలా చాలా ట్రైన్స్ పయనించినప్పటికీ మనకి దానికి సంబందించిన వీడియోలు అందుబాటులో వుండవు.కాబట్టి వాటిని చూడలేకపోయాము.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోని ఒక ప్రయాణికుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అయింది.ఆ వీడియోని ఒకసారి గమనిస్తే… పట్టాల మీద రైలు ఒకటి కాదు రెండు కాదు అనేక ట్రాక్‌లను తప్పించుకుంటూ పాములాగా వంకర్లు పోతూ వెళుతుండడం మనం గమనించవచ్చు.

ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.అక్షరాలా మన దేశంలోని ట్రైనే ఇది.మహారాష్ట్రలోని పూర్ణ జంక్షన్‌( Purna Junction in Maharashtra )లో ఓ ట్రైన్‌ స్టేషన్‌కు చేరుకునే క్రమంలో తీసిన వీడియో ఇది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube