కారు ( Car ) కొనడం అనేది సగటు మధ్యతరగతి వాడి కల.దానికోసం ఎన్నో ప్లాన్లు వేసి, ఎన్నో అవసరాలు మానుకొని మరీ డబ్బు కూడబెట్టి తనకు నచ్చిన కారుని కొనుక్కుంటారు.
అయితే అలా ఎన్నో కలలు కని కొనుక్కున్న కారు షోరూమ్ నుండి ఇంటికి తీసుకెళ్ళాక ముచ్చటగా మూడు రోజులు తిరిగి తరువాత మొరాయిస్తే ఆ కారు ఓనర్ కి ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడో కాలుతుంది కదూ.ఇక్కడ కూడా అదే జరిగింది.దానికి అతగాడు నిరసనగా ఆ లక్షల విలువైన కారుని గాడిదలకు కట్టి ఊరేగించాడు.

అవును, ఇక ఈ తంతుని చూసిన నెటిజన్లు భారతీయుల నిరసనలు ఇలాగే ఉంటాయి అని కెమెంట్స్ చేస్తున్నారు.రాజస్థాన్ రాష్ట్రములోని( Rajasthan ) ఉదయ్ పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ విషయమై కారు యజమాని శంకర్‌లాల్( Shankar Lal ) మాట్లాడుతూ.“క్రెటా కారును మద్దిలోని రామ్‌జీ హ్యుందాయ్ షోరూమ్ నుంచి సరిగ్గా 2 నెలల క్రితం కొనుగోలు చేశాను.దానికోసం వారికి రూ.18 లక్షలు చెల్లించాను.అయితే కొద్ది రోజుల్లోనే కారులో సాంకేతిక సమస్య ఏర్పడింది.
దీంతో కారు స్టార్ట్ కూడా కాలేదు.ఈ సమస్యపైన షోరూమ్‌లోని ఉద్యోగులను సంప్రదించినా సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.దాంతో నేను ఈ నిరసనకు దిగాను.” అని చెప్పుకొచ్చాడు.

ఇక తిక్కరేగిన శంకర్ లాల్ తరచూ పాడవుతున్న తన కారును రెండు గాడిదలకు కట్టి బాజాభజంత్రీలతో ఊరేగింపుగా షోరూమ్‌కు తీసుకు రావడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.అయితే శంకర్ లాల్ చేసిన ఆరోపణలను షోరూమ్ వారు కొట్టి పారేస్తున్నారు.కారణం ఏదైనా ఈ వీడియోను చూసిన నెటిజన్లు భారతీయులతో ఎప్పుడు గొడవ పడకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే కారుకు గాడిదను( Donkey ) కట్టి లాగిన ఘటన ఇదే తొలిసారి కాదు.
గతంలో అనేక మంది సర్వీస్ విషయంలో చిర్రెత్తిపోయి తమదైన స్టైల్ లో నిరసనలు తెలుపడం జరిగింది.







