తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుమెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు సంగీతం అందించారు.ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇలా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం పనులలో బిజీగా ఉన్నారు.

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా (Pushpa 2Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ కు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.అయితే తాజాగా ఈయన ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ రోలింగ్ స్టోన్ (Rolling Stone) కవర్ పేజీ పై దేవిశ్రీ ప్రసాద్ స్తానం దక్కించుకున్నాడు.

ఇక ఇదే విషయాన్ని రోలింగ్ స్టోన్ తమ అధికారక ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.తన మ్యూజిక్ స్టైల్ తో, చార్ట్ బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్.ఈ నెల మా మ్యాగజైన్ పేజీని కవర్ చేశారు.
అంటూ కవర్ పేజీ ని పోస్ట్ చేస్తూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ ట్వీట్ పై దేవి శ్రీ ప్రసాద్ స్పందిస్తూ రోలింగ్ స్టోన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా తన ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉందంటూ రిప్లై ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







