హోమ్‌లెస్ బాలుడికి చెప్పులు, బట్టలు కొనిచ్చిన పోలీస్.. నెటిజన్లు ఫిదా!

నిరాశ్రయుడైన ఓ బాలుడి పట్ల ఒక పోలీసు అధికారి( Police Officer ) దయ తలిచారు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్‌గా మారింది.

 Police Officer Kind Gesture Towards A Homeless Boy Video Viral Details, Police O-TeluguStop.com

ఈ వీడియోను అభయ్ గిరి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.వీడియోలో పోలీసు ఒక హోమ్‌లెస్ బాలుడికి( Homeless Boy ) నీరు అందించి, ఆపై ఒక జత బ్లూ కలర్ చెప్పులు ఇవ్వడం చూడవచ్చు.

అంతేకాదు, వాటిని బాలుడు ధరించడంలో సహాయం చేశారు.మంచినీళ్లు ఇచ్చే ఎండలో కాళ్లు కాలకుండా చెప్పులు ఇచ్చి పోలీసు ఎంతో సహాయం చేయడంతో ఆ బాలుడు తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు.

సంతోషంతో చిరునవ్వులు చిందించాడు.తన కృతజ్ఞతను తెలియజేయడానికి పోలీసు పాదాలను తాకడానికి ప్రయత్నించాడు.

అయితే ఆ మంచి మనసున్న పోలీసు అక్కడితో ఆగలేదు.కొత్త ప్యాంటు, బ్లూ కలర్ టీ షర్ట్ ఇచ్చి ఆ అబ్బాయిని ఆశ్చర్యపరిచారు.అలా తన దాతృత్వాన్ని మరోసారి చూపించారు.బాలుడు తన ఆనందాన్ని అదుపు చేసుకోలేక మళ్లీ పోలీసు పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు.ఈ వీడియోకి “ఈ చిరునవ్వు మనసును గెలుచుకుంది,” అని ఒక క్యాప్షన్ జోడించారు.ఈ పోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రతి పోలీసు అధికారి అతనిలా ఉండాలని ఆకాంక్షించారు.

నిరాశ్రయులైన అభాగ్యులకు కాస్త ప్రేమ చూపినా చాలు వారు ఎంతో సంతోషిస్తారని, ఆ సంతోషాన్ని చూస్తే మనకు సంతోషం వేస్తుందని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 3.35 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది.తమ విధిని మించి, అవసరమైన వారికి సహాయం చేసే పోలీసు అధికారులు ఇప్పటికీ ఉన్నారని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube