వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వార్తా కథనాలు ప్రసారం చేస్తున్న మీడియా హౌస్ లపై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) నిప్పులు చెరిగారు ….ఆస్తి కోసం సునీత భర్త వివేకానంద రెడ్డి గారిని చంపించారనుకుంటే ముందుగా చంపాల్సింది సునీత నని ఎందుకంటే తన ఆస్తిని సునీత పేర బాబాయి ఎప్పుడో రాసేసాడని ఆ విషయం తనకి ఎప్పుడో తెలుశని ఆమె స్పష్టం చేశారు .
ఆస్తి కోసం సునీత దంపతులు ఆయనను హత్య చేశారన్న ఆరోపణల లో వాస్తవం లేదని ఆమె తేల్చేశారు …కడప ప్రజల అభిమాన నేత అయిన తన బాబాయ్ వివేకానంద రెడ్డి పై కొన్ని మీడియా ఛానల్లు అవాకులు చవాకులు ప్రసారం చేస్తున్నారని,.తిరిగి రాలేడు కాబట్టి తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించుకోలేడు కాబట్టి పనిగట్టుకొని అవాస్తవాలను కొన్ని మీడియా ఛానల్లు ప్రసారం చేస్తున్నాయని , తన బాబాయ్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా ఆయా ఛానల్కు లేదని ఆ ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నానని వైఎస్ షర్మిల చెప్పారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Viveka Case ) విషయంలో రెండో పెళ్లి తాలూకు సమస్యలు మరియు ఆర్థిక గొడవలు ఉన్నాయని .వివేకానంద రెడ్డికి అనేక అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయంటూ ఇటీవల సాక్షి ఛానల్ లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి .….ఇప్పుడు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా సాక్షి ఛానల్ ను దృష్టిలో పెట్టుకునే అంటూ కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి ….
పేపర్ లీకేజ్ విషయంలో సీట్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్న సందర్భంలో షర్మిలా ను బలవంతంగా నిలువరించాలని చూసిన పోలీసుల పట్ల దు రుసుగా ప్రవర్తించారని , విదుల్లో ఉన్న పోలీసుల మీద చెయ్యి చేసుకున్నారనే కారణాలతో షర్మిల ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
ఇప్పుడు బెయిల్ పై విడుదలైన షర్మిల తన గురించి నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి( Y.S.Avinash Reddy )కి అనుకూలంగా కథనాలు ప్రచారం చేస్తున్న సాక్షిపై కోపంతోనే ఈ రకంగా వ్యాఖ్యలు చేశారని తన అన్న పట్ల ఉన్నకోపాన్ని ఆమె ఈ రకంగా తీర్చుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.