మెగా హీరోలలో ఒకరైన సాయితేజ్ విరూపాక్ష(Saitej, Virupaksha )సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.ఈ సినిమా స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుండటంతో ఫ్యాన్స్ సైతం తెగ సంతోషిస్తున్నారు.
విరూపాక్ష సినిమా సంయుక్త మీనన్ కు సైతం మంచి పేరు తెచ్చిపెట్టింది.కొన్ని సన్నివేశాల్లో ఆమె నటనను చూసి సినీ అభిమానులు షాక్ అయ్యారు.
అయితే కొన్ని నెలల క్రితం సాయితేజ్ కు యాక్సిడెంట్ జరగగా అబ్దుల్ ఫర్హాన్(Abdul Farhan) అనే వ్యక్తి సాయితేజ్ ను కాపాడారు.ఈ వ్యక్తి సకాలంలో స్పందించడం వల్లే సాయితేజ్ త్వరగా కోలుకోవడం సాధ్యమైందని చాలామంది భావిస్తారు.
ఆ వ్యక్తికి తాను ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తన కాంటాక్ట్ ఇచ్చానని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేస్తానని హామీ ఇచ్చానని సాయితేజ్ విరూపాక్ష ఇంటర్వ్యూలలో చెప్పారు.

అయితే అబ్దుల్ ఫర్హాన్ మాత్రం సాయితేజ్ చేసిన కామెంట్లలో ఎలాంటి నిజం లేదని తాను సాయితేజ్ ను కలవలేదని చెబుతున్నారు.అప్పట్లో మెగా కుటుంబం లక్షల్లో తనకు సాయం చేసినట్టు వచ్చిన వార్తలు నన్ను ఇబ్బంది పెట్టాయని ఆ వార్తల వల్ల ఉద్యోగం మానేసి ప్రస్తుతం మరో ఉద్యోగం చేస్తున్నానని అబ్దుల్ వెల్లడించారు.సాయితేజ్ కలవాలని కోరితే తాను కలుస్తానని అబ్దుల్ చెప్పుకొచ్చారు.

ఈ కామెంట్ల విషయంలో సాయితేజ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.సాయితేజ్ టీమ్ లో ఎవరైనా సాయితేజ్ ను తప్పుదోవ పట్టించి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయితేజ్ అబ్దుల్ ఫర్హాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఈ వార్తలు ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది.సాయితేజ్ ఈ దిశగా అడుగులు వేస్తారో లేదో చూడాల్సి ఉంది.
సాయితేజ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.








