ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకున్న మహిళ.. చివరికి ఏం జరిగిందంటే..?

ఇటీవలే కాలంలో ఒకరిని ప్రేమించి పరిస్థితుల కారణంగా మరోకరిని పెళ్లి చేసుకున్న వారిలో దాదాపుగా 80 శాతం మంది తమ మాజీ ప్రేమ వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై దారుణంగా బలవుతున్నారు.ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకుంటే.

 A Woman Who Loves One And Marries Another What Happened In The End , Woman, Babu-TeluguStop.com

కలిసి తిరిగిన ఫోటోలు, చాటింగ్లు లాంటి వాటితో బెదిరింపులకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

చివరికి ఏమైందో తెలుసుకుందాం.వివరాల్లోకెళితే కర్ణాటకలోని బబులేశ్వర ( Babuleswara in Karnataka )తాలూకా లోని ఉప్పలదిన్నే గ్రామానికి చెందిన అల్తాఫ్ సులేమాన్, సుహనాలు ఓ సంవత్సరం పాటు ప్రేమించుకున్న తర్వాత వీరి ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబ సభ్యులకు తెలియడంతో, సూహనా తల్లిదండ్రులు వేరే యువకుడికి ఇచ్చి సుహనా వివాహం చేశారు.

సుహనా( Suhana ) ను మర్చిపోలేక పోతున్న అల్తాఫ్ ఎలాగైనా సుహానాను దక్కించుకోవడం కోసం తరచూ సుహానాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో పాటు మెసేజెస్ పెట్టేవాడు.అయితే ఆల్తాఫ్ స్నేహితులైన దస్తగిరి సాబ్, యునీస్ లు మరింత రెచ్చగొట్టడంతో అల్తాఫ్ సైకోలాగా మారిపోయాడు.

భర్తను వదిలేసి తన వద్దకు రావాలంటూ మెసేజ్ పెట్టడంతో పాటు తామద్దరం కలిసి దిగిన ఫోటోలను మీ ఆయనకు పంపిస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు.ఇక రోజురోజుకు అల్తాఫ్ వేధింపులు పెరుగుతూ పోతూ ఉండడంతో సుహానకు ఏం చేయాలో అర్థం కాక చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఇంట్లో ఎవరు లేని సమయంలో వీడియో రికార్డింగ్ పెట్టి, తన చావుకు అల్తాఫ్, దస్తగిరి సాబ్, యునీస్( Altaf, Dastagiri Saab, Younis ) లు కారణం అని చెప్పి లైవ్ సూసైడ్ చేసుకుంది.తన ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని సుహానా కోరింది.సుహానా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వీడియో ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.తమ కూతురి ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube