ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.దంతేవాడలో మావోయిస్టులు జవాన్ల వాహనాన్ని టార్గెట్ చేసుకుని మందుపాతరను పేల్చారు.
ఈ ఘటనలో పదకొండు మంది జవాన్లు మృతిచెందారు.మృతులంతా డీఆర్జీ విభాగానికి చెందిన వారిగా గుర్తించారు.
వీరిలో పది మంది జవాన్లు కాగా ఒక డ్రైవర్ ఉన్నారని సమాచారం.మరికొందరికి గాయాలు కావడంతో ప్రత్యేక హెలికాప్టర్ సాయంతో సమీప ఆస్పత్రికి తరలించారు.







