Ajay Bhupathi Payal Rajput: ఆ సినిమా కోసం పాయల్ కంటే ముందు 100 మంది అమ్మాయిలను సంప్రదించిన డైరెక్టర్.. చివరికి?

డైరెక్టర్ అజయ్ భూపతి( Ajay Bhupathi ) ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఆర్ఎక్స్ 100.( Rx100 ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

 After Auditioned Nearly 100 Girls Then Ajay Decided To Choose Payal Rajput-TeluguStop.com

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.ఇక ఇటీవల సిద్ధార్థ్,శర్వానంద్ తో కలసి మహాసముద్రం సినిమాను రూపొందించినప్పటికీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఇది ఇలా ఉంటే అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా మంగళవారం.( Mangalavaram )

ఇందులో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ని తీసుకోకముందు దర్శకుడు అజయ్ భూపతి చాలా మంది అమ్మాయిలను ఆడిషన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా వందమందికి పైగా అమ్మాయిలను ఆడిషన్స్ అయితే ఎవరూ కుదరకపోవడంతో చివరికి పాయల్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే ఆమెకు సంబంధించిన పోస్టర్ ని చూసినప్పుడే అర్థమయి ఉంటుంది.ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది.ఈ సినిమాలో చాలా సస్పెన్స్ ఉంటుందని త్రిల్లింగ్ సన్నివేశాలు కూడా చాలా ఉంటాయి అని తెలుస్తోంది.ఇకపోతే అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఆర్ఎక్స్ 100 లో పాయల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి మూడో సినిమాలో పాయల్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube