భార్యపై అనుమానంతో భర్త దారుణం..!

ఈ మధ్యకాలంలో అనుమానాలతో కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్నాయి.ఇతరులతో మాట్లాడిన, ఇంటికి ఆలస్యంగా వచ్చిన, ఎక్కువగా ఫోన్లో మాట్లాడిన అనవసరంగా అనుమానాలు మొదలవుతాయి.

 Husband Killed Wife With Suspicion In Banaganapalle Details, Husband Killed Wife-TeluguStop.com

భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే ఎన్నో అనుమానాలు తీరిపోతాయి.అలా కాకుండా చిన్నచిన్న అనుమానాలు మనసులో అలాగే పెట్టుకుంటే చివరకు అవి కుటుంబాలనే దారుణంగా నాశనం చేస్తాయి.

ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన బనగానపల్లెలో ( Banaganapalle ) చోటు చేసుకుంది.ఈ ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులని ఆశ్చర్యపరిచింది.

దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Banaganapalle, Madhavi-Latest News - Telugu

బనగానపల్లె లోని యనగండ్ల గ్రామంలో ఈనెల 20వ తేదీన భార్య మాధవిని( Madhavi ) హత్య చేశాడనే కారణంగా కొరపాటి నాగప్రసాద్ ను( Korapati Nagaprasad ) స్థానిక పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు.విచారణ అనంతరం డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం నిందితుడి వివరాలను మీడియాకు తెలిపారు.యనగండ్ల గ్రామానికి చెందిన నాగప్రసాద్ క్లీనర్ గా పనిచేసేవాడు.

ఇతని భార్య మాధవి నిత్యం కూలీ పనులకు వెళ్ళేది.ఈ క్రమంలో భార్య తరచూ ఇతరులతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుండడంతో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందేమో అని అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయంపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.హత్య జరగడానికి ఒక వారం ముందు ఇద్దరి మధ్యన పెద్ద గొడవ జరగడంతోమాధవి, భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telugu Banaganapalle, Madhavi-Latest News - Telugu

ఇరు కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి రాజీ కుదర్చడంతో కేసు ఉపసంహరించుకున్నారు.ఆ తర్వాత కూడా మాధవి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ నెల 20న అందరూ నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో మాధవి తలంపై గట్టిగా కొట్టడంతో రక్తపు మడుగులోకి జారి ప్రాణాలు విడిచింది.భార్య చనిపోయిన విషయం తెలిసి నాగప్రసాద్ అక్కడి నుంచి పరారయ్యాడు.తాజాగా మంగళవారం గ్రామ వీఆర్వో ఎదుట తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

స్థానిక పోలీసులు మరోసారి విచారించి కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube