మామూలుగా కొంతమందికి జాతకాలలో దోషాలు ఉంటాయి.ఆ దోషాలపరంగా వారికి కొన్ని నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
అయితే చాలావరకు సామాన్యులు ఇటువంటి దోషాల గురించి పట్టించుకోరు.కానీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్నవాళ్లు ఈ దోషాల గురించి బాగా పట్టించుకుంటూ ఉంటారు.
వారి జాతకంలో ఏదైనా దోషం ఉంటే చాలు వెంటనే వాటికి పరిహారం చేయించుకుంటారు.ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీలు తమకు దోషము ఉందని తెలిసి రకరకాల పూజలు చేయించుకున్నారు కూడా.
అయితే హీరోయిన్ శ్రీ లీల( Sreeleela ) జాతకంలో కూడా ఒక దోషం ఉందని తెలుస్తుంది.అంతేకాకుండా అది ఆమెకు తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుందని తెలిసింది.మరి ఆమెకు వచ్చే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్రాళ్లకు క్రష్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీ లీల అని చెప్పాలి.ఈ ముద్దుగుమ్మ తన లేలేత అందాలతో కుర్రాళ్ళందర్నీ తన వైపుకు మలుపుకుంది.ఆమె గురించి ఏదైనా వార్త వస్తే చాలు కుర్రాళ్ళు అన్ని పనులు వదిలేసుకుని మరి ఆమె గురించి తెలుసుకుంటారు.
అలా అందరినీ అంతగా మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోలను సైతం మాయం చేసింది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

పెళ్లి సందD( Pelli SandaD ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమాలో తన డాన్స్ తో, నటనతో బాగా మార్కులు సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత రవితేజతో ధమాకా( Dhamaka )లో నటించి మరింత సక్సెస్ అందుకుంది.దీంతో ఈ అమ్మడి క్రేజ్ బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.
ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ బ్యూటీ ఉందని చెప్పాలి.

ఇక సోషల్ మీడియా( Social Media )లో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలతో తన అందాలను బయట పెడుతూ తనను మర్చిపోకుండా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అది ఏంటంటే ఆమె జాతకంలో ఒక దోషం ఉందని తెలిసింది.
ఆ ప్రభావం తన సినిమాలపై పడుతుందని తెలిసింది.

ఇక తనకు సినీ రంగం సెట్ అవ్వదని.లేని పోనీ ఇబ్బందులు వస్తాయని ఆమెకు ముందే తెలిసినప్పటికీ కూడా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది అని కొందరు చెప్పుకొస్తున్నారు.దీంతో నిజంగానే ఆమె జాతకంలో ఏదైనా దోషం ఉండటం నిజమైతే రానున్న ఐదు సంవత్సరాలలో ఆమె కెరీర్ మొత్తం నాశనం అవ్వటం గ్యారెంటీ అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.ఈ వార్త విన్న తన అభిమానులల్లో కొందరు ఇవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు.







