DRS టైం ముగిశాక రివ్యూ.. రూల్స్ బ్రేక్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..!

క్రికెట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి.వాటిని మ్యాచ్ ఆడుతున్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిందే.

 Wriddhiman Saha Asks Review Even After Drs Timer Runs Out-TeluguStop.com

క్రికెట్ రూల్స్( Cricket Rules ) ప్రకారం అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రివ్యూ తీసుకునే అవకాశం ఉంటుంది.దీనినే DRS అనే పేరుతో క్రికెట్లో పిలుస్తారు.

ఫీల్డర్స్ ఆప్పీల్ చేసిన సమయంలో అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత బ్యాటర్లు 15 సెకండ్ల లోపు మాత్రమే రివ్యూ తీసుకునే అవకాశం ఉంటుంది.15 సెకండ్ల లోపు రివ్యూ తీసుకుంటే, థర్డ్ అంపైర్ కు ఆ సమాచారం వెళ్తుంది.టైం ముగిసిందంటే ఫీల్డ్ అంపైర్ DRS కాల్ ఆఫ్ చేస్తారు.

తాజాగా ఈ DRS రూల్ ను అంపైర్లు గాలికి వదిలేశారు.ముంబై – గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్( Arjun Tendulkar ) బౌలింగ్లో మూడో ఓవర్లో తొలి బంతిని సహా( Wriddhiman Saha ) ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి నేరుగా వికెట్ కీపర్ చేతికి చిక్కింది.

వెంటనే ఇషాన్ కిషన్ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ప్రకటించాడు.ఆ సమయంలో సహా నేరుగా రివ్యూకు వెళ్లకుండా, తన సహచర బ్యాట్స్ మెన్ శుబ్ మన్ గిల్ తో చర్చలు జరిపే లోపు DRS టైం ముగిసింది.

ఆ తర్వాత టైం ముగిసిన విషయం ఫీల్డ్ అంపైర్ గమనించకుండా సహ రివ్యూ ను థర్డ్ అంపైర్ కు ఫార్వర్డ్ చేశాడు.అయితే ఈ రివ్యూ లో ఫలితం మాత్రం సహ కు వ్యతిరేకంగా వచ్చింది.ఇది పక్కన పెడితే రూల్స్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ టైం ముగిశాక థర్డ్ అంపైర్ కు రివ్యూ పంపించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.క్రికెట్ రూల్స్ కేవలం జట్లకే పరిమితమా.

అంపైర్స్ కు ఉండవా అంటూ కొందరు అభిమానులు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube