గోవా బ్యూటీ ఇలియానా( Ileana ) తల్లి కాబోతుంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఆమె స్వయంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది.ఇటీవల మరో పోస్ట్ షేర్ చేసింది.
పోస్ట్ లో ఇలియానా సోదరి బ్లాక్ ఫారెస్ట్ కేక్ తయారు చేసి దానిని ఇలియానా కు ఇచ్చిందట.అత్యంత అద్భుతమైన బ్లాక్ ఫారెస్ట్ కేక్ తినాలంటే కచ్చితంగా మీరు రావాల్సిందే అన్నట్లుగా కామెంట్ పెట్టి ఇలియానా ఈ పోస్టు షేర్ చేసింది.
ఈ కేక్ పోస్టు తో కూడా ఇలియానా గర్భవతి అయి ఉండవచ్చు అనే అభిప్రాయానికి కొందరు వచ్చారు.
కానీ ఇటీవల ఆమె షేర్ చేసిన ఒక ఫోటోని చూస్తూ ఉంటే ఇలియానా నిజంగానే గర్భవతి అయి ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళితే ఇలియానా ఒక బీచ్ లో ఉన్న ఫోటో షేర్ చేసింది.ఆ ఫోటోని ఇలియానా చాలా నార్మల్ గా కనిపిస్తోంది.
ఆమెకు బేబీ బంప్ లేదు.అంతే కాకుండా బికినీలో ఉంది.
దాంతో నెటిజన్స్ నిజంగానే ఇలియానా గర్భవతి అయి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం స్టార్టింగ్ స్టేజ్ కనుక ఇలియానా బేబీ బంప్ కనిపించాల్సిన అవసరం లేదు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఇలియానా గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమె ముందు ముందు ఈ విషయమై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.ఇక ఇలియానా సినిమాల గురించి మాట్లాడుకుంటే తెలుగులో దేవదాస్( Devadasu ) సినిమా లో నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది.అతి తక్కువ సమయంలోనే ఇలియానా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.
మరో వైపు తమిళం( Kollywood )లో కూడా అవకాశాలు రావడం మొదలు పెట్టింది.సౌత్ లో కోటి రూపాయల వారితోషకం తీసుకున్న మొదటి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.
తెలుగు లో ఇలియానా నటించిన ఒక సినిమా కు ఆ సమయంలో కోటి రూపాయల పారితోషికం తీసుకోగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం చేశారు.
హీరోలు 5 నుండి 6 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్న సమయంలో ఇలియానా ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకోడాన్ని చాలా మంది తప్పు పట్టారు.ఇలియానాకు నిర్మాత అంతా ఇవ్వాల్సింది కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.హీరోయిన్స్ అప్పట్లో 35 నుండి 55 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ వరుసగా సక్సెస్ లు దక్కుతున్నాయి అంటే 75 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు.కానీ ఇలియానా ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత వారికి కూడా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తగ్గడం మొదలైంది.