మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఆ మధ్య తాను ఇక నుండి పూర్తిగా యంగ్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తానంటూ ప్రకటించాడు.తన సినిమాలు చూస్తూ పెరిగిన దర్శకులతో వర్క్ చేయడం వల్ల తాను కొత్తగా ఫీల్ అవ్వడంతో పాటు తనను ప్రేక్షకులకు కొత్తగా చూపించాలని వారు భావిస్తారు.
వెండి తెరపై నన్ను చూసిన వారు ఇప్పటి వారికి వెండి తెరపై నన్ను ఎలా చూపించాలో తెలుసు.అందుకే వారి కోసం తన డేట్లు ఇచ్చేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.
అందులో భాగంగానే తన అభిమాని అయిన బాబికి డేట్ ఇచ్చి వాల్తేరు వీరయ్య సినిమా ను చేయడం జరిగింది.

వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు చేసి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఇక నుండి మరింతగా దూకుడుగా యంగ్ దర్శకులతో సినిమాలు చేసే విషయమై చిరంజీవి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది.
అందులో భాగంగానే పలువురు దర్శకులను పిలిచి మరి కథలు చెప్పమంటూ చిరంజీవి వారి ముందు కూర్చుంటున్నారట.కాస్త పేరు దక్కించుకున్న దర్శకుడు వెంటనే చిరంజీవి ఇంటికి వెళ్లే అవకాశాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

యంగ్ దర్శకులు కథలు చెప్తానంటే చిరంజీవి అసలు కాదనకుండా వింటున్నాడట.ఇప్పటికే 10 నుండి 15 కథలను మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఓపికగా విన్నారని వార్తలు వస్తున్నాయి.ఇటీవల నాని ( Nani )హీరోగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా రూపొందిన దసరా సినిమా( Dasara movie ) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ని కూడా పిలిచి చిరంజీవి కథ చెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది.ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష చిత్ర దర్శకుడికి కూడా మెగా కాంపౌండ్ నుండి పిలుపు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

ఏదైనా కథ ఉంటే అన్నయ్య చిరంజీవికి చెప్పండి బ్రదర్ అంటూ మెగా కాంపౌండ్ వారు ఫోన్ చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.మొత్తానికి చిరంజీవికి యంగ్ దర్శకులపై చాలా నమ్మకం కుదిరినట్లుంది.అందుకే ఇక నుండి ప్రతి సినిమాను కూడా యంగ్ డైరెక్టర్స్ తోనే చేయాలని నిర్ణయించుకున్నాడు.దర్శకులు అనుభవం లోపం కారణంగా అప్పుడప్పుడు తప్పు చేసే అవకాశాలుంటాయి.అందరూ కూడా బాబీ మాదిరిగా వాల్తేరు వీరయ్య సినిమా తరహాలో చిరంజీవి తో సినిమాలను చేయలేరు.కనుక మెగాస్టార్ కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటే బెటర్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







