'ఏజెంట్‌' సినిమా తర్వాత అఖిల్ అక్కినేని చేయబోతున్న సినిమా ఏంటి?

అక్కినేని ప్రిన్స్ అఖిల్ ( Akhil Akkineni )హీరోగా సురేందర్ రెడ్డి ( Surender Reddy )దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమా కు భారీ ఎత్తున పబ్లిసిటీ అయితే చేస్తున్నారు.

 Akhil Akkineni Not Doing Next Film Yet , Agent , Akhil Akkineni , Tollywood , S-TeluguStop.com

ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయం పక్కన పెడితే అఖిల్ ఏజెంట్( Agent ) సినిమా తర్వాత కచ్చితంగా తన క్రేజ్ అమాంతం పెరుగుతుందని ఏజెంట్ సినిమా కమర్షియల్ హిట్ అందుకోవడం ద్వారా తాను స్టార్ హీరోల జాబితాలో నిలుస్తాను అనే నమ్మకంతో కనిపిస్తున్నాడు.

అక్కినేని ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు.

Telugu Akhil, Mammootty, Nagarjuna, Sakshi Vaidya, Surender Reddy, Tollywood-Mov

దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడి ఏజెంట్ సినిమాను చేశారు.మరో సినిమా ఆలోచన లేకుండానే అఖిల్ ఈ రెండు సంవత్సరాలు ఏజెంట్ కోసం కష్టపడ్డాడు అంటూ సమాచారం అందుతుంది.ఏజెంట్ సినిమా చేస్తున్న సమయంలో కొత్త దర్శకులు.

రచయితలు.సీనియర్ దర్శకులు అఖిల్ కి కథలు చెప్పేందుకు వచ్చేవారట.

కానీ ఏజెంట్ సినిమా పూర్తి అయ్యే వరకు తాను ఏ ఒక్క కొత్త సినిమాకు కమిట్‌ అయ్యే పరిస్థితి లేదు అంటూ అఖిల్ పలువురు రచయితలకు దర్శకులకు నో చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Telugu Akhil, Mammootty, Nagarjuna, Sakshi Vaidya, Surender Reddy, Tollywood-Mov

అఖిల్ కి చెప్పాలనుకున్న రెండు.మూడు కథలు ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తానికి అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా విషయంలో క్లారిటీ రావాలంటే కనీసం ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Telugu Akhil, Mammootty, Nagarjuna, Sakshi Vaidya, Surender Reddy, Tollywood-Mov

కథను ఎంపిక చేసుకొని దర్శకుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకొని నిర్మాణ సంస్థ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత సినిమా మొదలు పెట్టాలంటే కచ్చితంగా నాలుగైదు నెలలు అయినా పడుతుంది కదా.అందుకే ఏజెంట్ సినిమా విడుదల కాకముందే అఖిల్ ఏదో ఒక సినిమాకు కమిట్ అయి ఉంటే వెంటనే షూటింగ్ కి వెళ్లేవాడు కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అఖిల్ కెరియర్ ని ప్లాన్ చేసుకోవడంలో ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదే విషయంలో నాగార్జున అయినా తన కొడుకుకు సలహా ఇస్తే బాగుంటుందేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube