మీ నాన్న గొప్పోడు.. మరి నువ్వేం పీకావ్.. గోపీచంద్ కు భారీ షాకిచ్చిన డైరెక్టర్!

కెరీర్ తొలినాళ్లలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన వాళ్లలో గోపీచంద్( Gopichand ) ఒకరు.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ మే నెల 5వ తేదీన రామబాణం( Rambanam ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Teja Huge Shock To Hero Gopichand Details Here Goes Viral In Social Media , Te-TeluguStop.com

శ్రీవాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం, గోపీచంద్ శ్రీవాస్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కావడంతో ఈ కాంబోలో తెరకెక్కిన రామబాణం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేయడం గమనార్హం.

ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.రామబాణం టైటిల్ ను బాలయ్య గారితో అనౌన్స్ చేయించారని ఆయనతో అనౌన్స్ చేయించడానికి కారణమేంటని తేజ గోపీచంద్ ను అడిగారు.

శ్రీవాస్ తో ఎన్నో సినిమా చేస్తున్నావని తేజ గోపీచంద్ ను ప్రశ్నించారు.నీకు బాగా నచ్చిన సినిమా ఏదని తేజ అడగగా జయం అని గోపీచంద్ సమాధానమిచ్చారు.

శ్రీవాస్( Srivas ) తో గొడవ నిజమేనా? అని తేజ గోపీచంద్ ను ప్రశ్నించారు.సినిమాల రిజల్ట్ నాకు తెలిసిపోతుందని ఏ సినిమా హిట్ గా నిలుస్తుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ముందే అర్థమవుతుందని గోపీచంద్ కామెంట్లు చేశారు.నేను నీ కోసం కథ సిద్ధం చేశానని హీరోయిన్ సెట్ కాలేదని అయితే ఆ సమయంలో నువ్వు ఫోన్ ఎత్తలేదని తేజ గోపీచంద్ తో చెప్పగా నేను చేసింది తప్పు అని గోపీచంద్ జవాబిచ్చారు.

మీ నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల జయం( jayam ) సినిమాలో నీకు ఛాన్స్ ఇచ్చానని తేజ గోపీచంద్ తో అన్నారు.మీ నాన్న గొప్పోడు? నువ్వేం పీకావ్? అని తేజ గోపీచంద్ ను ప్రశ్నించారు.ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకోగా ఫుల్ ఎపిసోడ్ రేపు ప్రసారం కానుంది.

తేజ పదునైన ప్రశ్నలకు గోపీచంద్ ఎలాంటి సమాధానాలు ఇచ్చారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube