ఏఐ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న మహీంద్రా!

అవును, మీరు విన్నది నిజమే.ఈ మాట అంటున్నది సాక్షాత్తు టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రానే( Anand Mahindra ).

 Mahindra Says There Is No Need To Worry About Ai ,ai, Anandh Mahindra, Technolo-TeluguStop.com

కృత్రిమమేధ ( artificial intelligence )(AI)తో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న వుదంతంపైన సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం ఏఐపై తన స్పందనను తెలియజేయడం గమనార్హం.

ఈ మేరకు ఆయన ఏఐ సృష్టించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

Telugu Ai, Anandh Mahindra, Ups-Latest News - Telugu

దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వృద్ధురాలిగా మారిన పరిణామక్రమాన్ని చూడవచ్చు.ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.”వరుస క్రమంలో మారే ఈ వీడియో ఏఐ సాయంతో జనరేట్ చేసింది.ఇందులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది స్పష్టంగా చూడొచ్చు.

నేను ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడంలేదు.ఎందుకంటే? అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది” అని ట్వీట్ చేయడం ఇపుడు ప్రాధాన్యతని సంతరించుకుంది.

Telugu Ai, Anandh Mahindra, Ups-Latest News - Telugu

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ”ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది, సూపర్” అని కొందరంటుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.కొంతమంది ఆ ఫొటోలోని ఐబాల్ అసలు చేంజ్ అవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే ‘‘ఏఐ ఫిక్షన్‌ సినిమాలాంటిది.మనిషి మెదడు డైరెక్టర్‌ లాంటిది.డైరెక్టర్‌ లేకుండా ఏఐ పనితనం ఏమి లేదు” అని కామెంట్లు చేయడం కొసమెరుపు.ఇకపోతే గత కొంతకాలంగా ఏఐ అనేది టాక్ అఫ్ ది టౌన్ గా మారిన సంగతి విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube