అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ఇపుడు పెను సంచలనాలు సృష్టిస్తోంది.దీని సాయంతో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు.
ఇప్పుడు తాజాగా భారతీయ క్రికెటర్లలో కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాలతో పసిపిల్లలుగా మారిపోయారు.అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే వారిలో కొందరు అప్పటికే గడ్డాలు, మీసాలతో ఉండడం కొసమెరుపు.
కాగా ఈ ఫోటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.ప్రపంచ సెలబ్రిటీలు, బిలియనీర్లు, రాజకీయ నాయకులు, కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలకు సంబంధించి గతంలో ఎన్నడూ చూడని రూపాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది అలాంటి వాటిని అలా చూసిన నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు.ప్రస్తుత కళలు, సృజనాత్మకత రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ ఛేంజర్‌గా మారిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ట్విట్టర్ యూజర్ గౌరవ్ అగర్వాల్( Gaurav Aggarwal ) తన ట్విట్టర్ అకౌంట్లో ఈ ఫోటోలోను పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఇండియన్ క్రికెటర్స్ టోడ్లర్ AI జెనరేటెడ్( Toddler is AI generated ) అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇకపోతే కృత్రిమ మేధస్సును ఉపయోగించి భారతీయ క్రికెటర్లను బాలురుగా రీక్రియేట్ చేయడం జరిగింది.ఈ ఫోటోలలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ( Virat Kohli, Rohit Sharma, MS Dhoni )రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, ఇతర భారత క్రికెటర్లు ఉన్నారు.కాగా ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.అయితే దానికి కారణం లేకపోలేదు.వాళ్ళని పసివారిగా చూపించిన ఏఐ, వారి గడ్డాలను, మీసాలను మర్చిపోయిందాని అని కౌంటర్ వేస్తున్నారు.







