దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా ( Thamanna ) గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma )తో కలిసి లిప్ లాక్ చేస్తూ కనిపించడమే అందుకు కారణమని చెప్పాలి.
ఇలా ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి.వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ విధంగా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా నేపథ్యంలో తమన్న వీటిని ఖండించే ప్రయత్నం చేశారు.ఇలా తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని చెబుతూనే ఇద్దరు కలిసి జంటగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా పలుమార్లు మీరు మీడియా కంటికి చిక్కారు.అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ జంటగా కలిసి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఇద్దరి మధ్య ప్రేమ లేదంటూనే వీరిద్దరూ ఇలా జంటగా కనిపించడంతో అసలు వీరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంది అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా విజయ్ వర్మ తమన్నా ఇద్దరూ కలిసి డిన్నర్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.ఇలా విజయవర్మ డ్రైవింగ్ చేస్తూ ఉండగా తమన్న పక్క సీట్లో కూర్చొని కారులో నుంచి బయట మీడియా వారికి బై చెబుతూ వెళ్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.
ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు.







