రామ్ చరణ్ భార్య కూతురిలా చూసుకుంది.. ప్రభాస్ పెద్దమ్మ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి( Shyamaladevi ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ కు అద్భుతమైన అమ్మాయి దొరకాలని మేము కోరుకుంటున్నామని పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని భావిస్తున్నామని ఆమె అన్నారు.

 Syamala Devi Shocking Comments About Prabhas Details Here Goes Viral , Shyama-TeluguStop.com

ప్రభాస్( Prabhas ) పెళ్లికి సంబంధించి వైరల్ అయిన రూమర్లను నమ్మవద్దని శ్యామలాదేవి తెలిపారు.ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్లతో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆమె అన్నారు.

కృష్ణంరాజు( Krishna Raju ) గారు ఇంట్లో పెసరెట్లు వేసేవారని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు.చిరంజీవి( Chiranjeevi ) గారికి నేను బిర్యానీ చేసి పంపించానని చిరంజీవి దోసెలు, వేర్వేరు చట్నీలతో పంపించారని శ్యామలాదేవి పేర్కొన్నారు.

ఒక సందర్భంలో అపోలో ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఉపాసన( upasana ) కూతురిలా చూసుకుందని మా సొంత అమ్మాయిలా చూసుకుందని ఆమె వెల్లడించారు.చరణ్ ఉపాసన అంటే నాకు చాలా ఇష్టమని శ్యామలాదేవి పేర్కొన్నారు.

కృష్ణంరాజు, ప్రభాస్ ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడరని మనం చూసే చూపును బట్టి అవతలి వ్యక్తి తీరు ఉంటుందని చెబుతారని ఆమె చెప్పుకొచ్చారు.ప్రభాస్ భక్త కన్నప్ప పాత్రలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని ఆ పాత్ర చేయడం ఎప్పటికి సాధ్యమవుతుందో చూడాలని ఆమె తెలిపారు.మన ఊరి పాండవులు సినిమా రీమేక్ లో ప్రభాస్ నటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అని శ్యామలాదేవి అన్నారు.

ప్రతి మనిషి జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయని ప్రభాస్ కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం జరిగి ఉండొచ్చని అయితే నేను వినలేదని ఆమె వెల్లడించారు.ప్రభాస్ ప్రకృతిలాంటివాడు అని శ్యామలాదేవి పేర్కొన్నారు.శ్యామలాదేవి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube