తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకి చంటి( Chalaki Chanti ) ఆరోగ్యం సరిగా లేదంటూ నిన్నటి నుండి మీడియాలో వార్తలు వస్తున్నాయి.కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ఆ విషయమే అధికారికంగా స్పందించలేదు.
మీడియా లో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రస్తారం చేస్తున్నారు.ఆ వార్తల సారాంశం ప్రకారం చలాకి చంటి గుండె పోటు తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు.
.ప్రస్తుతం ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు.ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.ఈ విషయాల్లో ఇప్పటి వరకు చంటి కుటుంబ సభ్యులు గాని సన్నిహితులు గాని ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.
చంటి ఆరోగ్యం విషయంలో జరుగుతున్న ప్రచారం విషయం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న చలాకీ చంటి ఆ మధ్య బిగ్ బాస్( Big Boss ) కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.
తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అని ఆశించిన సమయంలో ఆయన యొక్క తల పొగరు కారణంగా బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే.

ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సినిమాలు మరియు ఇతర షో లు అంటూ బిజీ బిజీగా ఉన్న చలాకి చంటి కి అనూహ్యంగా గుండె పోటు రావడం అనేది ఆందోళన కలిగించే విషయం.ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది.అంతే కాకుండా గుండె పోటు వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో చలాకీ చంటి కి గుండె పోటు అంటూ వార్తలు రావడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు చలాకీ చంటి గురించి ఆయన సన్నిహితులు మరియు జబర్దస్త్ కమెడియన్స్ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉండేవారు.
కానీ ఇప్పుడు ఆయన జబర్దస్త్( Jabardast ) లో లేని కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏ ఒక్కరు స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు.అసలు చంటి ఆరోగ్యం బాగానే ఉందా లేదా అనే విషయంపై కూడా ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వటం లేదు.
చలాకి చంటి ఆరోగ్యం విషయంలో నేడు లేదా రేపు ఒక స్పష్టత వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.మీడియా లో వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలని చంటి వచ్చి స్వయంగా ప్రకటిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.
అది సాధ్యమేనా చూడాలి.







