నెల్లూరు నగర పాలక సంస్థ సమావేశంలో రసాభాస నెలకొంది.నగర మేయర్, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
సీఎం జగన్ ఫొటోను తనకు తెలియకుండా ఎవరు పెట్టారని మేయర్ స్రవంతి ప్రశ్నించారు.ఈ క్రమంలో మేయర్ తీరుపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్రంగా మండిపడ్డారు.
అనంతరం అజెండా పేపర్లను ఎమ్మెల్యే అనిల్ కుమార్ వర్గం కార్పొరేటర్లు చించేశారు.తక్షణం మేయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేయర్ గా కొనసాగే అర్హత స్రవంతికి లేదంటూ వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.అదేవిధంగా మేయర్ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
మరోవైపు మేయర్ కు ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గం కార్పొరేటర్లు మద్ధతు తెలిపారు.దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.







