మరణం తప్పదని నాన్నకు ముందే తెలుసు... ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడి కామెంట్స్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో లెక్చరర్ పాత్రలలో నటించి తన కామెడీ ద్వారా ప్రేక్షకుల మొహాలపై చిరునవ్వు తెప్పించినటువంటి వారిలో నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam) ఒకరు.

 Dad Already Knew That Death Was Inevitable Dharmavarapu Subrahmanyams Sons Comme-TeluguStop.com

ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన ఈయన మరణించినప్పటికీ వెండి తెరపై సజీవంగానే ఉన్నారని చెప్పాలి.ఇక క్యాన్సర్(Cancer) తో బాధపడుతూ మరణించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి తాజాగా తన కుమారుడు రవి బ్రహ్మ తేజ (Ravi Bramha Teja) పలు విషయాలను వెల్లడించారు.

Telugu Brahmanandam, Car-Movie

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈరోజు మేము చాలా సంతోషంగా గడుపుతున్నాము అంటే అందుకు గల కారణం నాన్న చిన్నప్పటి నుంచి ఏ కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచారని ఇప్పుడు ఇలా ఉన్నామంటే కారణం ఆయనేనని తెలిపారు.2021 సంవత్సరంలో నువ్వు నేను సినిమా సక్సెస్ ఈవెంట్ కి వెళ్లి వస్తున్న సమయంలో నాన్న ఘోర కారు ప్రమాదానికి (Car Accident) గురయ్యారు.ఆ సమయంలో ఆయన తలకు 21 కుట్లు పడగా చేతికి రాడ్ వేసి సర్జరీ చేశారు.ఈ ప్రమాదం నుంచి కోరుకున్నటువంటి నాన్న తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఇక 2005వ సంవత్సరంలో ఉన్న ఫలంగా నాన్న అనారోగ్యానికి గురయ్యారు ఆయన సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల లంగ్స్ పూర్తిగా పాడయ్యాయని డాక్టర్లు తెలిపారు.

Telugu Brahmanandam, Car-Movie

దాదాపు పది రోజులపాటు కోమాలో ఉన్నారు.ఇలా రెండోసారి కూడా నాన్నని కాపాడుకున్నామని అయితే మూడోసారి తనని కాపాడుకోలేకపోయామని తెలిపారు.2012వ సంవత్సరంలో దీపావళి పండుగ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది.అయితే అప్పటికే లివర్ క్యాన్సర్ నాలుగవ స్టేజ్లో ఉందని మరి కొద్ది రోజులలో నాన్న చనిపోతారని డాక్టర్లు తెలిపారు.నాన్న కూడా తనకు మరణం తద్యమని భావించారు.

అయితే ఆ సమయంలో బ్రహ్మానందం (Brahmanandam) గారు నాన్నని చూడటానికి ఇంటికి వస్తానని చెప్పగా నాన్న నువ్వు వస్తే నన్ను చూసి తట్టుకోలేవు నేనే వస్తానని చెప్పారు.కానీ నాన్న 2013 డిసెంబర్ 7వ తేదీ మరణించారు.

నాన్న మరణించిన తర్వాత బ్రహ్మానందం గారు చూడటానికి ఇంటికి రాలేదు కానీ ఫిలిం ఛాంబర్ లో నాన్నను తలచుకుని చాలా ఏడ్చారని ఈ సందర్భంగా రవి బ్రహ్మ తేజ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube