పూరీ నెక్స్ట్ పై రోజుకొక రూమర్.. అసలు ఎవరితో మూవీ చేస్తాడు?

గత కొన్నాళ్లుగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా బాధ పడుతున్నారు.ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన పూరీ ఇప్పుడు మాత్రం ఫామ్ కోల్పోయాడు అనే చెప్పాలి.

 Who Is Becomes A Director Puri Jagannath Hero Details, Ram Pothineni, Ismart Sha-TeluguStop.com

అయితే ఈయన అభిమానులు మాత్రం పూరీ నుండి మరో బ్లాక్ బస్టర్ కోరుకుంటున్నారు.ఈయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.

ఇష్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండలో లైగర్ (Liger) సినిమాను తెరకెక్కించాడు.ఎన్నో అంచనాలతో ఈ సినిమాను రిలీజ్ చేయగా అది అట్టర్ ప్లాప్ అయ్యింది.

దీంతో పూరీ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.ఇదే సినిమా మంచి విజయం సాధించి ఉంటే మాత్రం పూరీ రేంజ్ మరోలా ఉండేది.

పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధించి ఉంటే వెంటనే జనగణమన స్టార్ట్ చేసేవాడు.కానీ లైగర్ దెబ్బతో ఈ సినిమాను ఆపేసారు.మరి లైగర్ గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయ్యింది.అప్పటి నుండి పూరీ మరో సినిమా ప్రకటించలేదు.

అందుకే ఫ్యాన్స్ పూరీ కొత్త సినిమా ఎప్పుడు? అని ఎదురు చూస్తున్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Ismart Shankar, Liger, Puri Jagannadh, Puri Jag

అయితే ఈ క్రమంలోనే రోజుకొక హీరో పేరు వినిపిస్తుంది.ముందుగా బాలయ్య (Balakrishna) తో సినిమా చేస్తున్నట్టు టాక్ వచ్చింది.బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని త్వరలోనే మూవీ స్టార్ట్ కూడా అవుతుంది అని రూమర్స్ వచ్చాయి.

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేరు వినిపించింది.గతంలో చిరుకి ఆటోజానీ కథ చెప్పాడు.ఆ కథ మీదనే కసరత్తులు చేసి ఒప్పించాడని టాక్ వచ్చింది.

Telugu Balakrishna, Chiranjeevi, Ismart Shankar, Liger, Puri Jagannadh, Puri Jag

ఇక బాలయ్య, చిరంజీవి మధ్య ఇప్పుడు రామ్ పోతినేని (Ram Pothineni) పేరు వినిపిస్తుంది.తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం రామ్ తోనే పూరీ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది.అది కూడా వీరి కాంబోలో సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సినిమాకు సీక్వెల్ అని టాక్ వస్తుంది.

మొత్తానికి రోజుకొక హీరో పేరు వినిపిస్తుంది కానీ ఎవరితో అధికారికంగా మాత్రం ప్రకటన రావడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube