బాలయ్య బాబు హీరోగా ఈ సంక్రాంతి కి రిలీజ్ అయిన వీర సింహ రెడ్డి సినిమా ( Veera Simha Reddy movie )మంచి విజయాన్ని అందుకొని సంక్రాంతి హిట్ గా నిలిచింది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్ళని రాబడుతూ బాలయ్య కెరియర్ లోనే తొలిసారి 100 కోట్ల మార్క్ దాటినా సినిమా గా గుర్తింపు తెచ్చుకుంది…అలాగే ఈ సినిమా బాలయ్య బాబు( Balakrishna ) అభిమానులకి చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ఈ సినిమా లో పెద్ద బాలకృష్ణ రోల్ చాలా మంది కి నచ్చింది…
డైరెక్టర్ గోపిచంద్ మలినేని( Director Gopichand Malineni ) ఈ సినిమాని చాలా బాగా తీసాడు బాలయ్య ని స్క్రీన్ మీద ఒక సింహం లాగా చూపించాడు అని ఇప్పటికే చాలా మంది ఆయన్ని మెచ్చుకుంటున్నారు…అయితే అందుతున్న సమాచారం ప్రకారం గోపిచంద్ మలినేని తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) తో చేస్తున్నాడు అని తెలుస్తుంది…ఇప్పటికే గోపి చంద్ మలినేని మీద రజినీకాంత్ కి మంచి ఒపీనియన్ ఉంది అందుకే ఈయన డైరెక్షన్ లో నటించడానికి రజిని సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది…ఇంతకు ముందు ఏం జరిగిందంటే…
సంక్రాంతి కానుకగా వచ్చిన వీర సింహ రెడ్డి సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వీరసింహ రెడ్డి సినిమా చూసి చిత్ర బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.సినిమా మేకింగ్ తనకెంతో నచ్చిందన్నారు.ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా వెల్లడించారు.
ఇది నాకొక అద్భుతమైన క్షణం తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశానని, సినిమా తనకెంతో నచ్చిందని ఆయన నాతో చెప్పారు.
మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు ఆయనకు కలిగిన భావోద్వేగం ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది.
థ్యాంక్యూ రజని సర్ అని గోపీచంద్ మలినేని అప్పట్లో ఒక ట్వీట్ కూడా చేశాడు…అయితే అదే సందర్భం లో రజినీ ఒక మంచి స్టోరీ ఉంటే చెప్పు మనం సినిమా చేద్దాం అనడం తో గోపి చంద్ మలినేని ఇప్పుడు ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ తయారు చేసి ఒక కథ చెప్పాడట అది బాగా నచ్చిన రజినికాంత్ ఈయనతో సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) నిర్మాతలే నిర్మించనున్నట్లు గా తెలుస్తుంది… ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం పోషించారు.ఆయన సరసన శ్రుతిహాసన్, హనీరోజ్ నటించారు.వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది…