టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇందులో బాలయ్య బాబు( Balakrishna ) సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో శ్రీ లీల బాలకృష్ణ కూతురిగా నటిస్తోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు.

ఇది ఇలా ఉంటే అనిల్ రావిపూడి( Anil Ravipudi ) సినిమాలు అంటే కచ్చితంగా ఆ సినిమాలలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని చెప్పవచ్చు.రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు పాత్రలుగా వచ్చిన గాలి సంపత్ సినిమాకి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి.వాళ్ళిద్దరి మధ్య అంతటి అనుబంధం వుంది.అనిల్ రావిపూడి తీసిన చివరి అయిదు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ ఒక ముఖ్య పాత్రలో కనిపించారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రాజేంద్రప్రసాద్ లేడు అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇదే బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ముందుగా ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ని తీసుకోవాలని సంప్రదించినప్పటికీ చివరి నిమిషంలో రాజేంద్ర ప్రసాద్ బదులు వేరే నటుడిని పాత్రకు ఎంపిక చేశారట.అందుకు గల కారణం బాలయ్య బాబు అని అంటున్నారు చిత్ర బృందం.
నందమూరి బాలకృష్ణ దర్శకుడుకి రాజేంద్ర ప్రసాద్ కి బదులు ఇంకో నటుడిని పెట్టుకోమని సలహా ఇచ్చారని యూనిట్ సభ్యులు అంటున్నారు.అయితే బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ని ఎందుకు వద్దన్నాడు, ఎందుకు రాజేంద్ర ప్రసాద్ కి బదులు వేరే నటుడిని పెట్టుకోమన్నారు అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.







