తాళ్లు చిక్కుకుపోయి కిందకు పడిపోయిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో వైరల్..

ఇటీవల కెవిన్ ఫిలిప్( Kevin Phillip ) అనే పారాగ్లైడర్( Paraglider ) స్పెయిన్‌లోని ఆర్గాన్యాలో పారాగ్లైడింగ్ చేస్తుండగా హార్ట్ బ్రేకింగ్ సంఘటన జరిగింది.ఈ పారాగ్లైడర్ ఫ్రీస్టైల్ అక్రోబాటిక్ మూవ్స్ ప్రదర్శిస్తుండగా, బీభత్సమైన ఈదురు గాలులు వచ్చాయి.

 Paraglider Narrowly Escaped From Ferocious Winds Video Viral Details, Paraglider-TeluguStop.com

దాంతో అతను పట్టుకున్న లైన్స్ చిక్కుకుపోయాయి.వింగ్స్ కేబుల్‌లో చిక్కుకుపోగా అతను తన పారాచూట్‌ను ( Parachute ) విడుదల చేయలేకపోయాడు.

చిక్కుబడ్డ లైన్ల కారణంగా అది రిలీజ్ కాలేదు.దీంతో గాల్లో ఉన్న అతనికి ముచ్చెమటలు పట్టాయి.

అతను వేగంగా నేల వైపు దూసుకు వస్తుంటే మరింత భయమేసింది.కెవిన్ అతని నుంచి లైన్లను, రిప్‌కార్డ్‌ను లాగడానికి చాలా ఫాస్ట్‌గా వ్యవహరించాడు.ఎలాగోలా చిక్కుముడి విప్పేసి భూమిని తాకడానికి ఒక సెకను ముందు పారాచూట్‌ను రిలీజ్ చేయగలిగాడు.చివరికి భూమిపై ప్రాణాలతో ల్యాండ్ అయ్యాడు.అప్పటికీ అతనికి కాస్త దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.ఎందుకంటే మరీ తక్కువ హైట్ నుంచి అతను పారాషూట్ ఓపెన్ అయింది.

దీని వల్ల భూమిపై కాస్త బలంగా అతను పడిపోయాడు.

కెవిన్ హెల్మెట్‌లోని 360-డిగ్రీ కెమెరాను ఉపయోగించి ఈ సంఘటనను రికార్డ్ చేశారు.ఆ వీడియోను అతను యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.అది కాస్త వైరల్ గా మారింది.

అందులో నేలపైకి పడిపోతున్నప్పుడు తనను తాను రక్షించుకోవడానికి కెవిన్ ఎంత త్వరగా పెనుగులాడుతున్నాడో చూడవచ్చు.ఇలాంటి పరిస్థితులలో ఉండే ఎవరైనా సరే ప్రాణాలపై ఆశలు వదిలేసుకుని కింద పడిపోతారు.

కానీ ఈ వ్యక్తి మాత్రం చివరి క్షణం వరకు తన ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి ఆశ్చర్యపరిచాడు.ఈ వీడియో చూసిన చాలామంది వావ్ అని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు అతడికి ఈ భూమి మీద బతికే నూకలు ఉన్నట్లు ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube