సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం సైబర్ నేరస్తుల ఎత్తులకి పైఎత్తులు వేస్తూ మన విలువైన కష్టార్జీతాన్ని కాపాడుకుందాం.సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు తక్షణమే కాల్ చేయండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లా: సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో వచ్చే అధిక లాభాలు ఆశ చూపించే మెసేజెస్లు, ప్రకటనలు చూసి మోసపోవద్దు అని సైబర్ మోసాల పై అవగాహన కలిగి ఉండి సైబర్ నేరస్తుల ఎత్తులకి పైఎత్తులు వేస్తూ మన విలువైన కష్టార్జీతాన్ని కాపాడుకుందాం, జిల్లా పరిధిలో ఏరకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.
సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు. నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ మొదలగు వంటి వాటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు…
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు ●తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాట్సప్ ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది అందులో ఒక లింక్ ఉంది.
ఆ లింకు ద్వారా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అతని ఎక్కువగా కమిషన్ వస్తుందని నమ్మి దాదాపు 3,00000/- రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు.కానీ అతనికి ఎటువంటి కమిషన్ రాలేదు చివరగా అతని మోసపోయాడని తెలుసుకున్నారు.
●వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కి టెలిగ్రామ్ ద్వారా ఒక లింక్ రావడం జరిగింది.ఆ లింక్ ఓపెన్ చేసి అందులో టాస్క్ కంప్లీట్ చేసి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మి బాధితుడు 3,10,000-/ రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు.
కానీ చివరగా అతనికి ఎలాంటి అమౌంట్ రాలేదు తద్వారా బాధితుడు మూడు లక్షలు నష్టపోయాడు.
●సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కంపెనీ వారు కేవైసీ కోసమని చెప్పి ఒక అప్లికేషన్ పంపించడం జరిగింది.
అందులో ఓపెన్ చేసి బాధితుడు అతని యొక్క క్రెడిట్ కార్డు నెంబర్స్ మరియు ఓటీపీ షేర్ చేసుకున్నాడు దీని ద్వారా బాధితుడు లక్ష 1,90,000 నష్టపోయాడు.
●వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు టెలిగ్రామ్ లో ఒక లింకు వచ్చింది ఆ లింకు ద్వారా బిట్కాయిన్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో తిరిగి డబ్బులు వస్తాయని గుర్తు తెలియని వ్యక్తి తో చాట్ చేయగా చెప్పాడు.
అతడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి 1,00,000-/ రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది.కానీ సస్పెక్ట్ నుంచి ఎలాంటి స్పందన లేదు దీని ద్వారా బాధితుడు లక్ష రూపాయలు నష్టపోయాడు.
●సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు యొక్క మొబైల్ నెంబర్ ఉపయోగించి ఒక గుర్తు తెలియని వ్యక్తి షేర్ చాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో నుండి ఒక అమ్మాయికి మెసేజ్ చేసినట్టుగా చేసి ఆ అమ్మాయి తరఫున వారు బాధితుడిపై హార్రాస్మెంట్ కేసు పెడతాను బెదిరించి బాధితుల దగ్గర నుంచి 36000ఫోన్ పే చేయించుకున్నారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.
ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.