సినిమా రాజకీయం దాదాపు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటుంది.రాజకీయంలో ఎదగాలంటే అంతకు ముందు సినిమాల్లో పాపులర్ అయిన వాళ్లు బాగా ఉపయోగపడతారు అని ఒక నానుడి.
లేదా రాజకీయ నాయకులకు గ్లామర్ కోసం సినిమా వాళ్లు బాగా ఉపయోగపడతారు.ఇలా ఏదో ఒక పద్ధతిలో రాజకీయం సినిమా కలగలిపే ముందుకు సాగుతూ ఉంటాయి.
అయితే తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు ఎన్టీఆర్ సామాజిక వర్గం నుంచి చాలా మంది పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశారు.అవేమీ కార్యరూపం దాల్చలేదు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి సామాజిక వర్గం నుంచి కూడా చిరు కన్నా ముందే ఎంతో మంది పార్టీ పెట్టాలని ప్రయత్నాలు చేశారు.అందులో దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) కూడా ఒకరు.
దాసరికి పార్టీ పెట్టాలని కుతూహలం బాగానే ఉంది.ఆయన పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు అన్న విషయం తెలియగానే గోనే ప్రకాష్ రావు ( Gone Prakash Rao )ఆయన పక్కన చేరారు.పార్టీ పెట్టాలంటే తమ కులం ఓట్లు ఎంత.? మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాలతో సహా అంకెలు, వాటి చరిత్ర చెప్పగలవా మేధావి గోనె ప్రకాష్ రావు.మీరు పార్టీ మొదలు పెట్టండి సార్ చాలా ఓట్లు వచ్చి పడతాయి మీకు తిరుగు ఉండదు అంటూ గోనే దాసరికి నూరిపోసారు.రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి ఉంది కానీ పార్టీ పెట్టాలంటే మాత్రం ఏదో ఒక రకమైన జంకు మాత్రం దాసరిలో ఉంది.
ఇక తెల్లవారితే దాసరి పుట్టినరోజు.ఆ రోజు పార్టీ ప్రకటన జరుగుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు.అంతకన్నా ముందే ఒక మీటింగ్ పెట్టాలనుకున్నారు దాసరి.బసంత్ టాకీస్ లో ఆయన అభిమాన సంఘాలను అందరినీ కూడా పిలిచి పార్టీ గురించి చర్చించారు.అట్టహాసంగా ఈ మీటింగ్ అయితే జరిగింది కానీ పార్టీ పెట్టడం మాత్రం కార్యరూపం దాల్చలేదు.
దాసరి పార్టీ పెట్టడం లేదు అనే విషయం తెలిసిన వెంటనే గోనె ప్రకాశరావు మీడియాకు చేరవేయాలనుకున్నారు.ఆయన ఆంధ్ర భూమి పత్రిక ఫోన్ చేసి పురజనుల కోరిక మేరకు దాసరి పార్టీ ప్రకటన వాయిదా అనే వార్త రాయాలని చెప్పారు.కానీ మీడియా అత్యుత్సాహంతో పార్టీ ప్రకటన ఆపేస్తున్నారు అంటూ రాశారు.
ఆ తర్వాత నిజంగానే ఆయన పార్టీ పెట్టకుండా కాంగ్రెస్( Congress party ) లో చేరి కేంద్ర మంత్రి పదవిని పొందారు.అలా మొదలవకుండానే గిట్టిపోయింది దాసరి నారాయణరావు రాజకీయ పార్టీ.