షిప్‌లో ప్రపంచాన్ని చుట్టేయాలని రూ.17 లక్షలు ఖర్చు.. చివరి ట్విస్ట్ తెలిసి షాక్!

సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో ప్యాషన్ ఉంటుంది.కొందరికి డబ్బులు బాగా సేవ్ చేసుకొని వాటి పైనే బతకాలని ఉంటుంది.

 17 Lakhs Spent To Go Around The World In A Ship Shock To Know The Last Twist, Wo-TeluguStop.com

మరికొందరికి వాటితో వ్యాపారం చేయాలని ఉంటే ఇంకొందరికి వాటన్నిటిని ఖర్చు పెట్టాలనే తపన ఉంటుంది.అలాంటి వారిలో ట్రావెల్స్ ఒకరని చెప్పవచ్చు.

ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేవారు ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన డబ్బుతో ప్రపంచం చుట్టేయాలని కలలు కంటారు.క్రిస్టోఫర్ చాపెల్( Christopher Chappell ) అనే 72 ఏళ్ల వ్యక్తి కూడా అలాగే కలలు కన్నాడు.

వాటిని సాకరం చేసుకునేందుకు తగినంత డబ్బు సంపాదించాడు.ఒక క్రూయిజ్ షిప్‌లో( cruise ship ) ప్రపంచాన్ని చుట్టి రావడానికి £17,500 (సుమారు రూ.17 లక్షలు) ఖర్చు చేశాడు.

అయితే జర్నీ మొదలుకావడానికి కొంత సమయమే మిగిలి ఉందనగా అతనికి కాస్త అనారోగ్యంగా అనిపించింది.

దాంతో సదరు వ్యక్తి వైద్య పరీక్షల కోసం ఫిలిప్పీన్స్‌లో( Philippines ) ఓడ నుంచి కిందకు దిగాడు.అంతా చెకప్ చేశాక ప్రయాణానికి అనుమతి లభించింది.దాంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.షిప్ ఎక్కుదామని అతడు ఉరుగులు పరుగులు తీశాడు.

అయితే తీరా అతని కోసం వేచి ఉండకుండా ఓడ వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు.అలా చివరికి అతని సంతోషం అంతా ఆవిరైపోయింది.

Telugu Cruise Ship, Medical-Latest News - Telugu

ఇక చేసేదేమీ లేక అతడు మేనకోడలు కరెన్ విలియమ్స్‌తో( Karen Williams ) కలిసి క్రూయిజ్ నిర్వాహకులు, ప్రయాణ బీమా సంస్థలను సంప్రదించడానికి ప్రయత్నించాడు.కాగా అతను ఓడలో ప్రయాణించడానికి వైద్యపరంగా అనర్హుడని వారు చెప్పారు.తదుపరి నౌకాశ్రయానికి విమానంలో ప్రయాణించవద్దని వైద్యులు అతనికి సూచించారు.విమానంలో వెళ్తే గానీ ఆ షిప్ అందుకోవడం సాధ్యం కాదు.కానీ ఇతనికి విమాన ప్రయాణం చాలా ప్రమాదకరం.ఎందుకంటే డాక్టర్ల ప్రకారం అతని ఆరోగ్యం చాలా విషమంగా ఉంది.

Telugu Cruise Ship, Medical-Latest News - Telugu

దాంతో చేసేది లేక క్రిస్టోఫర్ చివరికి ఏప్రిల్ 7న యూకేకి ఇంటికి తిరిగి వచ్చాడు.చాపెల్ క్రూయిజ్‌లో తిరిగి చేరలేకపోయినందుకు తన నిరాశను వ్యక్తం చేశాడు, అతని వైద్య పరిస్థితి విషమంగా లేదని.ఓడ నుంచి తనను పంపిన వ్యక్తి తనను అసలు పరీక్షించలేదని పేర్కొన్నాడు.తన తప్పేమీ లేనప్పుడు ఆసుపత్రిలో మంచంపై ఉంచారని విమర్శించారు.ఏది ఏమైనా ఈ వృద్ధుడి బాధ గురించి తెలిసి చాలామంది అయ్యో పాపం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube