నల్లగొండ జిల్లా:రంజాన్ పర్వదినం ముస్లిం సహోదరులకు పవిత్ర మాసం అయినప్పటికీ సర్వమత సమ్మేళనంగా అందరూ కలిసి జరుపుకునే పండుగని పిఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.శనివారం నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని లారీ అసోసియేషన్ ఆఫీస్ వద్ద గల ఈద్గా వద్ద రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్ధనలు చేసిన రశీద్ మౌలానాకు మరియు ముస్లిం సోదరులకు అయన ఈద్-ముబారక్ తెలియజేశారు.
సర్వ మతాలు సోదర భావం, సౌభ్రాతృత్వం గురించి బోధిస్తున్నాయని,ప్రజలు మత సామస్యాన్ని కోరుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో దుర్గం జలంధర్,జిల్లా మహేందర్, కొమ్ము అరవింద్,చౌగోని సైదులు గౌడ్,మాగి సైదులు,కుర్ర నవీన్ కుమార్ ముదిరాజ్, చెట్థుపల్లి మోహన్ కృష్ణ తదితరులు ఉన్నారు.