బీజేపీ, కాంగ్రెస్ మైండ్ గేమ్.. డైలమాలో బి‌ఆర్‌ఎస్ ?

తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుతున్నాయి.నిన్న మొన్నటి వరకు బి‌ఆర్‌ఎస్ పార్టీనే టార్గెట్ గా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచించేవి.

 Bjp And Congress Mind Game With Brs , Bjp , Congress ,brs , Kcr , Revan-TeluguStop.com

బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని కాంగ్రెస్ నేతలు చెబుతుంటే.కాదు కాదు బి‌ఆర్‌ఎస్ తరువాతి స్థానం కాంగ్రెస్ పార్టీదే అందులో నో డౌట్ అంటూ హస్తం నేతలు చెబుతుండే వారు.

ఇలా ఇరు పార్టీల నేతలు కూడా కే‌సి‌ఆర్ సర్కార్ ను ఇరుకున పెట్టె విధంగానే విమర్శలు గాని ఆరోపణలు గాని చేసేవారు.దాంతో ఎవరెన్ని విమర్శలు చేసిన ఫైనల్ గా బి‌ఆర్‌ఎస్ పార్టీనే వార్తల్లో నిలిచేది.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

ప్రజల్లో ఎప్పుడు కే‌సి‌ఆర్ పేరే వినిపించేది.కానీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బి‌ఆర్‌ఎస్( Brs party ) ను సైడ్ నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర ఆరోపణలకు తెరతీశాయి.బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై( Revanth Reddy ) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.మునుగోడు ఎన్నికల సమయంలో కే‌సి‌ఆర్ నుంచి రేవంత్ రూ.25 కోట్లు పుచ్చుకున్నారని ఆరోపించారు.దీనికి రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే స్పందించారు.తాను కే‌సి‌ఆర్ వద్ద డబ్బు తీసుకోలేదని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దంఅని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.ఆ ఆరోపణలను నిరూపించే సత్తా ఈటెల కు ఉంటే ఆయన కూడా ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

కేవలం సవాల్ వరకే కాకుండా ఆయన తాజాగా భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు కూడా.దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వర్సస్ ఈటెల( Etela Rajender ) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.దీంతో అటు వార్తల్లోనూ, ఇరు ప్రజల్లోనూ ఈ ఇద్దరికి సంబంధించిన చర్చే అధికంగా జరుగుతోంది.

అయితే ఇదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని కొందరి అభిప్రాయం.

Telugu Bandi Sanjay, Congress, Etela Rajender, Revanth Reddy, Ts-Politics

అధికారంలో ఉన్న పార్టీ పై ఏ ఆరోపణలు చేసిన కే‌సి‌ఆర్ తరచూ వార్తల్లో నిలిచే అవకాశం ఉంది.అలా కాకుండా అధికారం కోసం పడే పార్టీలు పరస్పర ఆరోపణలు దూషణలకు పాల్పడితే అధికార పార్టీపై ఉన్న ఫోకస్ ఈ రెండు పార్టీలపై పడే అవకాశం ఉంది.ఇదే వ్యూహంగా హస్తం నేతలు, కమలనాథులు ప్రయత్నిస్తున్నట్లుగా కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube