చిన్న కూతురు నిర్మాణంలో మెగా స్టార్‌.. ఆ విషయమే సస్పెన్స్‌

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం భోళా శంకర్( Bhola Shankar ) చిత్రం చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వం లో రూపొందుతున్న ఆ సినిమా ను అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

 Chiranjeevi Movie In Sreeja Production With New Director , Chiranjeevi , Sreej-TeluguStop.com

ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు.చిరంజీవి ని విభిన్నమైన పాత్ర లో దర్శకుడు మెహర్ రమేష్ చూపించబోతున్నట్లుగా కూడా వారు తెలియజేశారు.

ఇక చిరంజీవి తదుపరి సినిమా కు సంబంధించిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Sreeja, Sushmita-Movie

చిరంజీవి ఎక్కువగా బయట నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తున్నాడు.అయితే తన తదుపరి సినిమా చిన్న కూతురు శ్రీజ( Sreeja ) నిర్మాణం లో ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.పెద్ద కూతురు సుస్మిత( Sushmita ) ఇప్పటికే నిర్మాణ సంస్థ ప్రారంభించి వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మరో వైపు చిన్న కూతురు శ్రీజ కూడా నిర్మాణం వైపు అడుగులు వేస్తుందని.ఆమెను ప్రోత్సహించడం కోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఒక సినిమా ను ఆమె బ్యానర్ లో నటించేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆమె బ్యానర్ లో చిరంజీవి సినిమా కన్ఫమ్ అయింది.కానీ ఇప్పటి వరకు దర్శకుడు కన్ఫమ్ కాలేదు.ప్రస్తుతం యంగ్ హీరోల కథలను పరిశీలిస్తున్న చిరంజీవి అతి త్వరలోనే ఒక యంగ్ దర్శకుడికి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Sreeja, Sushmita-Movie

ఈ మధ్యకాలంలో ముగ్గురు నలుగు హీరోలు చిరంజీవి కి కథ ను వినిపించారు అంటూ వార్తలు వస్తున్నాయి.వారిలో ఒకరిని చిరంజీవి ఓకే చేస్తాడా లేదంటే మరిన్ని కథలు విని కొత్త దర్శకులను పరిశీలిస్తాడా అనేది చూడాల్సి ఉంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ శిష్యుల్లో ఒకరైన యువ దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడట.

ఆ సినిమా ను శ్రీజ నిర్మించేందుకు సిద్ధమవుతుందట.అయితే ఈ విషయాలన్నింటిపై అధికారికంగా ప్రకటన రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే శ్రీజ నిర్మాణంలో చిరంజీవి సినిమా ఇదే ఏడాది పట్టాలు ఎక్కి వచ్చే సంవత్సరం సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube