సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష( Trisha ) సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది.అయినా కూడా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మునుపటి కంటే కూడా అందంగా కనిపిస్తోంది అంటూ అభిమానులతో ప్రశంసలు దక్కించుకుంటుంది.ఆకట్టుకునే రూపం.
వావ్ అనిపించే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం.

అందుకే ఇప్పటికి కూడా హీరోయిన్ గా బిజీ బిజీ గానే ఉంది.త్వరలో మణిరత్నం దర్శకత్వం లో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2( Ponniyin Selvan 2 ) సినిమా తో ప్రేక్షకులకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న త్రిష ప్రతి రోజు విభిన్నమైన లుక్ లో కనిపిస్తూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా సర్ప్రైజ్ చేస్తుంది.
హాట్ డ్రెస్ వేసినా.ట్రెడిషనల్ డ్రెస్ వేసినా త్రిష అందం ముందు ఎంతటి వాళ్లేనా దిగదుడిపే అన్నట్లుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ స్థాయి అందం కేవలం త్రిష కు మాత్రమే సొంతం అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి త్రిష అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ అభిమానులు మరియు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన త్రిష ఈ మధ్య కాలంలో మాత్రం టాలీవుడ్ కి కాస్త దూరంగా ఉంటుందని చెప్పాలి.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉండడానికి కారణం ఏంటి అనేది క్లారిటీ లేదు.
కానీ ఆమె అందాన్ని చూస్తూ ఉంటే తెలుగు ప్రేక్షకులు మళ్లీ ఆమెను తెలుగు సినిమాలో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.

ముందు ముందు అయినా త్రిష తెలుగు సినిమాల్లో బిజీ అవుతుందేమో చూడాలి.చిరంజీవి( Chiranjeevi ), బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు అయినా ఆమె తో కలిసిన నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఆమె అందానికి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి స్టార్స్ కూడా కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి.
కానీ వారు మాత్రం త్రిషని పట్టించుకోవడం లేదని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కనీసం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అయినా త్రిష తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.







