సమంత నటించిన శాకుంతలం, సాయితేజ్ నటించిన విరూపాక్ష ( Virupaksha ) సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి.శాకుంతలం సినిమా( Shaakuntalam ) ట్రిపుల్ డిజాస్టర్ గా నిలవగా విరూపాక్ష సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
అయితే సమంతకు ( Samantha ) పని చేయని సింపతీ సాయితేజ్ కు( Saitej ) కొంతమేర పని చేసిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతోంది.
ఈ వ్యాధి లక్షణాలు ఇతర వ్యాధులకు భిన్నంగా ఉంటాయి.ఈ వ్యాధి నుంచి సమంత కోలుకున్నా పూర్తిస్థాయిలో మాత్రం కోలుకోలేదు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత సింపతీ కోసం ప్రయత్నించినా శాకుంతలం సినిమా ఆమెకు మరో భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.అయితే సాయితేజ్ కూడా తన యాక్సిడెంట్ గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.
సాయితేజ్ కు మాత్రం సింపతీ వర్కౌట్ అయింది.

విరూపాక్ష మూవీకి 24 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.సాయితేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 నుంచి 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా మెగా ఫ్యాన్స్ నుంచి తమ వంతు సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం.
సాయితేజ్ ప్రస్తుతం వినోదాయ సిత్తం సినిమా రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

విరూపాక్షలో సాయితేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించగా ఈ జోడీని రిపీట్ చేయాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వినోదాయ సిత్తం రీమేక్ జులై నెల 28వ తేదీన రిలీజ్ కానుంది.ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని ఒరిజినల్ కు ఈ సినిమాకు పోలిక ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
యంగ్ హీరో సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.







