అమెరికా : కాలిఫోర్నియా బే ఏరియాలో ఘనంగా ‘‘హిమాచల్ డే’’ వేడుకలు

అమెరికాలోని( America ) కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో( Bay Area ) నివసిస్తున్న హిమాచల్ రాష్ట్రానికి( Himachal Pradesh ) చెందిన భారతీయులు మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో ‘‘హిమాచల్ దినోత్సవాన్ని’’( Himachal Day ) జరుపుకున్నారు.దీపం వెలిగించి గాయత్రీ మంత్రం పఠించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.

 Himachal Day Celebrations In United States Details, Himachal Day Celebrations ,u-TeluguStop.com

ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు( CM Sukhvinder Singh Sukhu ) పంపిన ఆడియో సందేశాన్ని, అభినందనలను నిర్వాహకులు ఆహుతులకు తెలియజేశారు.అమెరికాలోనూ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, ప్రదర్శించినందుకు గాను బే ఏరియాలో నివసిస్తున్న హిమాచలీలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సహకరించినందుకు గాను బే ఏరియా హిమాచల్ గ్రూప్.ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు (ఇన్నోవేషన్ అండ్ ఐటీ) గోకుల్ బుటైల్‌కి ధన్యవాదాలు తెలిపింది.

ఈ కార్యక్రమానికి డాక్టర్ అక్షయ్ రుంచల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.ఆమె తన సంస్థ కాంగ్రా ఆర్ట్స్ ప్రమోషన్ సొసైటీ (కేఏపీఏ) ద్వారా కాంగ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ను పునరుద్దరించడానికి, సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

Telugu America, Bay Area, Calinia, Cmsukhvinder, Gayatri Mantra, Gokul Butail, H

అలాగే రాష్ట్ర సెనేటర్ డేవ్ కోర్టెస్, కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా జిల్లా డైరెక్టర్ టామ్ పైక్, అడ్వైజరీ కమిషన్ అధ్యక్షుడు అజయ్ భూటోరియా, స్టేట్ అసెంబ్లీ సభ్యులు యాష్ కల్రా, అలెక్స్ లీ తదితరులు కూడా హిమాచల్ డే కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సాంప్రదాయ నట్టి, గిడ్డ, కవిత్వం, పహాడీ పాటలను ఆలపించారు.ఈ పాటలకు ప్రేక్షకులు సైతం మైమరచిపోయారు.అంతేకాకుండా రాష్ట్రానికి చెందిన ఫేమస్ వంటకాలను కూడా అతిథులకు రుచి చూపించారు.

Telugu America, Bay Area, Calinia, Cmsukhvinder, Gayatri Mantra, Gokul Butail, H

కాగా.ప్రతి యేటా ఏప్రిల్ 15న హిమాచల్ దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటారు.హిమాచల్ ప్రదేశ్ 1948లో భారతదేశంలో ఉనికిలోకి వచ్చింది.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 28 చిన్న సంస్థానాలను విలీనం చేసి హిమాచల్ ప్రదేశ్‌ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేసింది పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం.

హిమాచల్ డేను అక్కడ సెలవుదినంగా పరిగణిస్తారు.ఈ రోజున రాష్ట్ర రాజధాని సిమ్లాలో గ్రాండ్ పరేడ్‌తో పాటు పట్టణాలు, గ్రామాలలో సాంస్కృతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube