నానక్ రామ్ గూడలో US కాన్సులేట్‌ స్టార్ట్ అయింది… రోజుకి 3000కు పైగా వీసా అప్లికేషన్స్ షురూ!

విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు హైదరాబాద్( Hyderabad ) లోని నానక్ రామ్ గూడలో ప్రారంభమైన అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్( Jennifer Larson ) తాజాగా వెల్లడించారు.ఈ విషయమై ఇక్కడ రోజుకు 3000 నుండి 3500 మంది వరకు సేవలు పొందవచ్చునని, ఇక్కడ తమ కాన్సులేట్ సామర్థ్యం దాదాపు 3 రెట్లు పెరగనున్నదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

 Us Consulate Has Started In Nanak Ram Guda More Than 3000 Visa Applications Per-TeluguStop.com

ఇదివరకు బేగంపేటలో కాన్సులేట్ ఉన్నప్పుడు స్థలం, సిబ్బంది కొరత కారణంగా రోజుకు 1100 దరఖాస్తులు ప్రాసెస్ అయ్యేవని, కొత్త కార్యాలయంలో 3000కు పైగా ప్రాసెస్ చేయవచ్చు అని అన్నారు.

2007లో ప్రారంభమైన బేగంపేట కార్యాలయంలో 16 కాన్సులర్ విండోల ద్వారా తక్కువ దరఖాస్తుల ప్రాసెస్ జరిగేదని అందరికీ తెలిసిందే.కాగా ఇక్కడ కొత్త కార్యాలయంలో 54 విండోల ద్వారా 3000 నుండి 3500 ప్రాసెస్ అవుతాయని తెలుస్తోంది.ప్రస్తుతం కాన్సులర్ విండోలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని, అన్ని విండోల ద్వారా సేవలు అందించేలా సిబ్బంది సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు జెన్నీఫర్ లార్సన్ చెప్పారు.

సామర్థ్యం పరంగా దక్షిణాసియాలో అతిపెద్ద క్యాంపస్‌గా తమ కాన్సులేట్‌ రికార్డ్ సృష్టించిందన్నారు.

ఇకపోతే తాత్కాలిక ఉద్యోగాల కోసం గత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా( America )కు వెళ్లిన దక్షిణాసియావాసుల్లో డెబ్బై శాతం మంది భారతీయులేనని, భారత్ లోని 5 కాన్సులేట్ లలో కలిపి ఈ ఏడాది కనీసం 10 లక్షల మంది భారతీయులకు వీసా ఇంటర్వ్యూలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.కాగా విద్యార్థి వీసాల ప్రక్రియను మరింత వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube