సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఒక్కోసారి చాలా స్పెషల్ గా అనిపిస్తాయి, దానికి కారణం అవి చాలా ఎమోషనల్ గా ఉండడమే.ఇక్కడ చాలావరకు వీడియోలు ఫన్నీగా వున్నవే వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే కొన్ని వీటిమధ్య చాలా స్పెషల్ గా కనిపిస్తూ ఉంటాయి.ఇలాంటివి ఎన్నిసార్లు చూసిన మనకు బోర్ కొట్టదు.
అలాగే చూస్తూనే వుండాలపిస్తుంది.ఎందుకంటే అవి మనల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంతో పాటు మన హృదయాలను హత్తుకుంటాయి కాబట్టి.
ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఇక వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే నెటిజన్లు ఎందుకు అంత ఉద్వేగానికి లోనయ్యేరన్నది మీకు తెలుస్తుంది.ఈ వీడియోను ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.
వృద్ధ దంపతుల( Old couple ) రైలు ప్రయాణానికి సంబంధించిన ఈ వీడియోను అదే రైలు( train )లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు రహస్యంగా చిత్రీకరించడం విశేషం.అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను భర్త సపర్యలు చేస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఆమె అనారోగ్యంతో ఉంది.ఆమె భర్త తన సపరిచర్యలు చేయడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.ఈ క్రమంలో తన భార్యకు చాలా ప్రేమతో తినిపిస్తున్నారు.అలా తినిపిస్తున్నపుడు ఆహారం తన పెదాలకు తగులుతుంటే తన చేత్తో తుడుస్తూ మళ్లీ ఆమెకు తినిపిస్తున్నాడు.అలా చేయడమే కాదు రాత్రి కూడా తన భార్యను చేయిపట్టుకుని టాయిలెట్‌కు తీసుకెళ్లి నిద్రపోయే వరకు పక్కనే కూర్చోవడం విశేషం.తను పడుకున్నాక అప్పుడు భర్త కూడా సేదతీరాడంటూ ఈ వీడియో చిత్రీకరించిన ప్రయాణికుడు తెలిపాడు.
కాగా ఈ వీడియో కొన్ని మిలియన్ల మనసులను తాకుతోంది.