బోయపాటి( Boyapati srinu ) సినిమాలు అంటే మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ కలిపి ఉంటాయి ఈయన తీసిన సినిమాలు కనక మనం చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది.అలాగే రామ్ ని ఇప్పటి వరకు మనం ఒక లవర్ బాయ్ గెటప్ లో చూసాం.
కానీ ఆయన ఫస్ట్ టైం రూట్ మార్చి పూరి జగన్నాధ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మాస్ హీరో గా మంచి హిట్ కొట్టాడు ఈ సినిమా సక్సెస్ తర్వాత రామ్ మంచి మాస్ హీరో అవుతాడు అని అందరు అనుకున్నారు కానీ ఆ తర్వాత తీసిన రెడ్,ది వారియర్( The Warriorr ) సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు గా నిలిచాయి.దింతో ఇప్పుడు రామ్ కి ఒక హిట్ తప్పనిసరి కాగా బోయపాటి తో ఒక మంచి యాక్షన్ సినిమా తీయడానికి సిద్దమయ్యాడు రామ్.అయితే రీసెంట్ గా ఈ సినిమా స్టోరీ లీక్ అయింది అంటూ నెట్ లో ఒక స్టోరీ ఫుల్ గా వైరల్ అవుతుంది…
ఆ స్టోరీ ఏంటంటే… రామ్( Ram pothineni ) ఒక కాలేజీ లో చదువుకుంటూ ఉంటాడు అక్కడే హీరోయిన్ పరిచయం అవుతుంది.ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి అది ప్రేమ కి దారి తీస్తుంది.అయితే అనుకోకుండా ఒకరోజు హీరోయిన్ కనపడకుండా పోయే సరికి హీరో తనని వెతుకుంటూ ఒక ఊరికి వెళ్తాడు.అక్కడ ఒక రౌడీ తో హీరో కి గొడవ అవుతుంది దాంతో వాళ్ళు హీరో రామ్ ని చంపాలని చూస్తారు.
అయితే వీళ్లు చంపాలనుకుంటున్న రామ్ వేరు హీరో రామ్ వేరు అని రౌడీ లు తెలుసుకునే లోపే హీరో రామ్ కుటుంబానికి జరగాల్సిన నష్టం జరుగుతుంది.అయితే హీరోయిన్ ని తీసుకెళ్లిన వాళ్ళు హీరో ఫ్యామిలీ కి అన్యాయం చేసినవాళ్లు ఒక్కరే అని తెలుసుకొని వాళ్ళ మీద రివెంజ్ తీసుకొని హీరోయిన్ ని కాపాడడమే ఈ సినిమా స్టోరీ…
అయితే ఈ స్టోరీ విననడానికి రొటీన్ గా ఉన్నప్పటికీ బోయపాటి తన మార్క్ టేకింగ్ తో ఈ సినిమాని అద్భుతంగా తీస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది…భారీ యాక్షన్ సెటప్ తో ఒక భారీ ఫైట్ కూడా ఈ మధ్య షూట్ చేసినట్లు తెలుస్తుంది…మొత్తానికి బోయపాటి అయినా రామ్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి…
.