వైరల్: ఇది జోకేంట్రా బోకు! అని యూట్యూబర్‌పై మండి పడుతున్న నెటిజన్లు.. విషయం ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.పాకిస్తానీ యూట్యూబర్ షావీర్ జాఫ్రీ( Shaveer Jaffrey ) చేసిన ఓ టిక్‌టాక్ వీడియోపై నెటిజన్లు ఇపుడు తమదైన రీతిలో విరుచుకుపడుతున్నారు.

 Viral It's Zocentra Boku! The Netizens Who Are Angry At Youtuber This Is The Mat-TeluguStop.com

షావీర్ ఆ వీడియో ద్వారా కామెడీ చేయాలనుకుంటే అది కాస్తా తీవ్ర విమర్శలకు దారితీయడం కొసమెరుపు.ఈ క్రమంలో ఓ నెటిజన్ ఇది జోకేంట్రా బోకు! దీనికి మేము ఇరగబడి నవ్వాలా? అంటూ ఘాటు కామెంట్ చేయడం మనం చూడవచ్చు.ఏ గృహహింస కారణంగానైతే ప్రతియేట దేశంలో వేలాది మంది హత్యగావింపబడుతున్నారో.దాన్నే ఈ మహానుభావుడు జోక్ చేయాలని చూశాడంటూ కొంతమంది మండిపడుతున్నారు.

షావీర్ జాఫ్రీకి తన భార్యతో కలిసి చేసిన ఈ టిక్‌టాక్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, భార్య సోఫాలో నిద్రపోతోంటే మెల్లగా వచ్చి ఆమె ముఖంపై దిండు గట్టిగా అదిమిపడతాడు.

అయితే, అతడు దిండు అదిమిపట్టిన చోట ఆమె తలకి బదులుగా కాళ్లు ఉంటాయి.భార్య లేచిచూసేవరకు గానీ అతడికి ఆ విషయం తెలియదు.

దాంతో చేతిలో ఉన్న దిండును ఆమె మెడ కింద ఉంచి, నుదిటిపై ముద్దాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అయితే ఇది వారి స్క్రిప్ట్ అయినప్పటికీ షావీర్‌ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురి చేసింది.ఎందుకంటే గృహ హింస ( domestic violence )కారణంగా పాకిస్థాన్‌లో( Pakistan ) ప్రతియేటా వేలాది మంది మరణిస్తున్నారు.కాగా అదే గృహహింసపై నీవు కామెడీ చేస్తావా? అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు మనోడిని ఉతికి ఆరేస్తున్నారు.తమదైన శైలిలో ప్రతిఒక్కరూ ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.చాలామంది నెటిజన్లు కామెంట్స్ పెడుతూ….“ఏ డొమెస్టిక్ వయోలెన్స్ ద్వారానైతే పాక్‌లో ప్రతి ఏడాది వేలాది మంది మహిళలు చనిపోతున్నారో దాన్నే మనోడు జోక్ అంటున్నాడు… ఒకసారి చూడండి.వీడికి బాగా బుద్ధి చెప్పండి!” అంటూ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube