వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి( MP Vijayasai Reddy ) తీరు మారుతుందా.ఆయన మెల్లగా తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) వైపు అడుగులు వేస్తున్నాడా అంటే అవును అనే సమాధానం స్వయంగా ఆయన సొంత పార్టీ నాయకులు మరియు కార్యకర్తల నుండి వినిపిస్తుంది.
ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మరియు నారా లోకేష్ లపై విజయసాయి రెడ్డి మాటల్లో చెప్పలేని బూతులను ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ గా చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.చంద్రబాబు నాయుడు మరియు లోకేష్( Lokesh ) లను ఆ స్థాయి లో మరెవరైనా విమర్శించి ఉంటారా.
తిట్టి ఉంటారా అంటే లేదు అనే సమాధానమే వినిపించేది.అలాంటి విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో కాస్త సైలెంట్ అయ్యాడు.
తెలుగు దేశం పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
అందుకే విజయసాయి రెడ్డి మెల్లగా తెలుగు దేశం పార్టీ వైపు జరిగేందుకు ప్రయత్నిస్తున్నాడు అని వైకాపా సోషల్ మీడియా వింగ్ ట్రోల్స్ చేస్తోంది.

విజయసాయి రెడ్డి వల్ల వైకాపా కు ఎలాంటి ప్రయోజనం లేదని జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) మంచితనం తో విజయసాయి రెడ్డి కి ఎంపీ పదవి ఇచ్చారంటూ వైకాపా శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.ఆ అభిమానాన్ని చూపించకుండా అధికారం కోసం చంద్రబాబు నాయుడుకు బానిస అయ్యేందుకు విజయ సాయి రెడ్డి సిద్ధం అవుతున్నాడు అంటూ వైకాపా కు చెందిన కొందరు నాయకులు ఆఫ్ ది రికార్డు విమర్శలు చేస్తున్నారు.ఈ విమర్శల పై ఎంపీ విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
మరో వైపు ఒకప్పుడు అంతగా విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా ఆహ్వానిస్తారనేది కూడా సందేహంగా మారింది.రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
కనుక విజయ సాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ లో జాయిన్ అవ్వడం పెద్ద బ్రహ్మ పదార్థం ఏమీ కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







