వినడానికి భయంకరంగా అనిపిస్తున్నా ఇది వాస్తవమే.సాధారణంగా మనం పరిశోధనలకోసం మనుషుల శవాలను, వివిధ శరీర భాగాలను వినియోగిస్తారనే విషయం విన్నాం.
అదేవిధంగా ఓ సైక్రియాటిస్ట్ గతంలో మానసిక అనారోగ్యాల గురించి పరిశోధన చేసేందుకు హ్యూమన్ బ్రెయిన్స్( Human brains, ) సేకరించాడు.ఇందులో ఆశ్చర్యకర విషయం ఏమంటే అయన అలా పదులు, వందలు సంఖ్యలో కాదు.
ఏకంగా వేల సంఖ్యలో మానవుల బ్రెయిన్స్ తన పరిశోధనాలకోసం సేకరించాడు.కొన్ని దశాబ్ధాలపాటు వాటిని భద్రపరిచాడు కూడా.

కాగా అవి ప్రస్తుతం బ్రెయిన్ పనితీరు తెలుసుకోవడానికి, చికిత్స ప్రభావాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని సమాచారం.వివరాల్లోకి వెళితే, ప్రముఖ డానిష్ సైకియాట్రిస్ట్ ఎరిక్ స్ట్రోమ్‌గ్రెన్(Erik Strömgren ) మొత్తం 9,479 బ్రెయిన్స్ సేకరించి రికార్డ్ సృష్టించాడు.మానసిక అనారోగ్యాల స్థానికీకరణ గురించి సమాధానాలను కనుగొనాలనే ఉద్దేశంతో ఆయన ఈ పని చేశారు.ఈ బ్రెయిన్స్‌ని 1945 నుంచి 1980 సంవత్సరాల మధ్య మానసిక ఆరోగ్య సమస్యలతో మరణించిన వారి నుంచి సేకరించారు.

ప్రస్తుతం వీటిని డెన్మార్క్‌లోని ఓడెన్స్ యూనివర్సిటీ( Denmark )లో భద్రపరిచారు.ఈ బ్రెయిన్స్‌కి వివిధ నంబర్‌లతో లేబుల్ చేసి, పెద్ద తెల్లని బకెట్లలో ఫార్మాలిన్‌లో ఉంచారు.మానసిక అనారోగ్యానికి గల కారణాల గురించి సమాధానాలను కనుగొనే ఆశతో మానసిక రోగుల నుంచి పెద్ద సంఖ్యలో బ్రెయిన్స్ సేకరించడం జరిగింది.

ఈ హ్యూమన్ బ్రెయిన్స్ సేకరించేందుకు ఎరిక్ స్ట్రోమ్‌గ్రెన్ రోగులను, వారి కుటుంబ సభ్యులను ఎప్పుడూ అనుమతి అడగలేదు.ఎందుకంటే గతంలో మానసిక రోగులు సమాజానికి భారమని, అప్పటి సమాజం భావించేది.వారి హక్కుల గురించి ఎవరూ ఆలోచించేవారు కాదు.







