బాలకృష్ణతో బోయపాటి సినిమా కన్ఫర్మ్ అయింది.అయితే అది ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
బాలకృష్ణ( Balakrishna ) తో సినిమా అంటే అంత ఈజీ కాదని ఆయన కోసం కథ ను రెడీ చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలం పడుతుందని దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ మరియు అఖండ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.
మూడు చిత్రాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.అందుకే వీరి కాంబినేషన్ లో నాలుగవ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు ఆఖండ సినిమా( Akhanda movie ) యొక్క సీక్వెల్ తో రాబోతున్నట్లుగా దర్శకుడు బోయపాటి శ్రీను మరియు హీరో నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.గత రెండు మూడు రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఆ విషయమై ఇంకా క్లారిటీ లేదు.ఈ నేపద్యంలో బోయపాటి సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఏకంగా సంవత్సర కాలం తీసుకుంటాడు.కనుక ఈ సినిమా పూర్తి అవ్వడానికి మినిమం వచ్చే సంవత్సరం చివరి వరకు అయినా సమయం పట్టే అవకాశం ఉంది.అంటే వచ్చే సంవత్సరంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు( assembly elections ) ముందు ఈ సినిమా రాదని తేలి పోయింది.
రాజకీయ మైలేజ్ కలిగే విధంగా బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయాలని ఆశించినప్పటికీ అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.అయితే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం అనేది నూటికి నూరు శాతం పక్కా అంటూ వారి సన్నిహితులు ధీమాతో చెబుతున్నారు.







