హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే ఫ్లాప్ చవి చూసిన గోపీచంద్( Gopichand ) ఆ తర్వాత నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు కొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు.ఆ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో గోపీచంద్ కి హీరో స్థాయి పాపులారిటీ సొంతం అయ్యింది.
దాంతో మళ్లీ హీరో గా గోపీచంద్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.హీరోగా తిరిగి కెరియర్ ఆరంభించినప్పటి నుండి వరుసగా సక్సెస్ లు దక్కించుకున్న గోపీచంద్ గత కొంత కాలంగా మళ్లీ వరుసగా డిజాస్టర్స్ ని చవి చూస్తున్నాడు.
అయినా కూడా అదృష్టం బాగుండి గోపీచంద్ కి వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.తాజాగా రామబాణం( Rambanam ) అనే సినిమాలో ఈ హీరో నటించాడు.
గతంలో లక్ష్యం మరియు లౌక్యం సినిమాలను శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్ చేయడం జరిగింది.ఇప్పుడు అదే దర్శకుడి దర్శకత్వంలో రామబాణం సినిమా ను చేశాడు.
తాజాగా సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.ఎందుకంటే ప్రస్తుతం ఈ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా ఒక సినిమా, ప్రభాస్( Prabhas ) హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.
అంతే కాకుండా పలువురు స్టార్ హీరోలకు సంబంధించిన డేట్లు కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది.ముందు ముందు మరిన్ని భారీ చిత్రాలు ఈ బ్యానర్ నుండి వచ్చే అవకాశం ఉంది.
అలాంటి బ్యానర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా అంటే కచ్చితంగా మినిమం స్పందన లభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ఈ సినిమా కనుక నిరాశ పరిచితే గోపీచంద్ కు ఇదే చివరి ప్రయత్నం అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది.