ఏం ఏం శ్రీలేఖ.( MM Srilekha ) రాజమౌళి కుటుంబం లో పుట్టిన మరొక ఆణిముత్యం.
తనకు ఏ అవసరం వచ్చినా ఎవరి పైన ఆధార పడకుండా తన సొంత కాళ్ళ పైన నిలబడి ఈ రోజు ఈ స్థాయి కి ఎదిగింది.కానీ సినిమా ఇండస్ట్రీ లో రాణించాలంటే ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి.
పైగా రాజమౌళి( Rajamouli ) కుటుంబం పద్దతి మిగతా వారికి చాలా భిన్నంగా ఉంటుంది.చాలా మంది ఆ కుటుంబం నుంచి నిర్మాణం, దర్శకత్వం, సంగీతం అంటూ పలు రంగాల్లో ఉన్నప్పటికీ ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు.
సినిమాల విషయాల్లో ఎటువంటి రికమండేషన్స్ కూడా చేసుకోవడానికి ఇష్టపడరు.
అందులో ముఖ్యంగా శ్రీ లేఖ ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో తెలుపుతూ వస్తున్నారు.
కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే కలుస్తాం కానీ ఒకరు సినిమా గురించి ఒకరం అడిగి తెలుసుకోమని సినిమా సంబంధించిన విషయాలను అసలు చర్చకు కూడా రాకుండా ఉంటాము అంటూ తెలిపారు.ఆమె చెప్పిన వ్యాఖ్యలు విన్న తర్వాత చాలామంది రాజమౌళి కుటుంబం శ్రీలేఖకు మద్దతు పలకడానికి ఇష్టపడరు అనే విషయం బహిర్గతం అవుతోంది అంటూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.

నిజానిజాలు ఎలా ఉన్నా శ్రీలేఖ మాత్రం తన స్వయంకృషితోనే ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చింది.తొమ్మిదేళ్ల వయసులోనే మొదటిసారి పాటలు పాడటం ప్రారంభించింది.ఆ తర్వాత 12 ఏళ్ల వయసులోనే సంగీతం కూడా అందించడం మొదలుపెట్టింది శ్రీలేఖ.తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాకు సంగీతం అందించిన శ్రీలేఖ తాజ్ మహల్ సినిమాతో( Taj Mahal Movie ) మొట్టమొదటి బ్లడ్ మాస్టర్ హిట్ అందుకుంది.
ఇక ఆమె చివరిగా సంగీతం అందించిన సినిమా హిట్ 2.( HIT 2 ) అడవి శేషు నటించిన ఈ సినిమా సంగీతం పరంగా మంచి మార్కులు అందుకుంది.

తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా సంగీతం అందించిన శ్రీలేఖ కొన్ని సినిమాలకు పాటలు సైతం పాడింది.శ్రీలేఖ వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె 2003 లో పుట్ట ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా, ఇప్పటికీ కూడా ఆమె అద్దె ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.ఇన్ని సినిమాలకు సంగీతం అందించిన తర్వాత కూడా ఆమె ఆర్థికంగా పుంజుకోకపోవడం గమనించాల్సిన విషయం.







