ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి( CM YS Jaganmohan Reddy ) ని వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు ఇబ్బందుల్లో నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే అధికార పార్టీ వైకాపా కి చెందిన నాయకుడు భాస్కర్ రెడ్డిని( Bhaskar Reddy ) సిబిఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది.
మరో వైపు వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy )ని కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది.
కోర్టు నుండి 25వ తారీకు వరకు అరెస్టు చేయకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత అయినా అవినాష్ రెడ్డి ని అరెస్టు చేసే అవకాశాలు లేక పోలేదు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడి సిబిఐ దూకుడును తగ్గించాలని భావించారట.
కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిబిఐ విషయంలో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదంటూ కేంద్రం తేల్చి చెప్పిందట.
దాంతో కేంద్రం తో గత కొన్నాళ్లుగా సాన్నిహిత్యంగా మెలుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ దెబ్బ తో దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ని కావాలనే బిజెపి అధినాయకత్వం టార్గెట్ చేసిందా అంటే అవును అనే సమాధానం కూడా వినిపిస్తుంది.కనుక జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే బిజెపిపై తిరుగుబాటు బావుట ఎగరవేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రం మరో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ పై కారాలు మిరియాలు నూరుతూ వచ్చే ఎన్నికల్లో ఆయన ను గద్దె దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించాడు.కేసీఆర్ తో కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా బిజెపికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.